మన దేశంలో రాఖీ పండుగ( Rakhi Festival )ను చాలా మంది ప్రజలు ఎంతో ఇష్టంగా జరుపుకుంటారు.అలాగే రాఖీ పండుగ కోసం సోదరీమణులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు.
ఇంకా చెప్పాలంటే రాఖీ పండుగ రోజు అన్నయ్య లేదా తమ్ముడికి రాఖీ కట్టి వారు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు.ఇక తన చెల్లి లేదా అక్క కు సోదరులు మంచి బహుమతిని ఇస్తూ ఉంటారు.
అయితే ఈ సారి రాఖీ పండుగ రెండు రోజులు వస్తూ ఉంది.ప్రతి సంవత్సరం ఈ పండుగ విషయంలో చిన్న సందేహం ఉంటుంది.

అయితే మంచి సమయంలో రాఖీ కట్టాలి.భద్ర నీడలో కట్టకూడదు అంటారు.కాగా ఈ సారి పండగ రోజున భద్ర నీడ( Bhadra Kaal ) ఉండడంతో పండుగ తేదీ ఎప్పుడూ అనే గందరగోళం ప్రజలలో ఏర్పడింది.అయితే హిందూ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు 30వ తేదీన ఈ పండుగను జరుపుకొనున్నారు.
కానీ పండుగ రోజు భద్ర నీడ ఉంది.అంతే కాకుండా ఆగస్టు 30వ తేదీన ఉదయం 10.59 నిమిషాల నుంచి రాత్రి 9 గంటల రెండు నిమిషముల వరకు భద్ర కాలం ఉంటుంది.ఈ సమయంలో రాఖీ పండుగను జరుపుకోవడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు.

అంతే కాకుండా భద్ర కాల సమయం ముగిసిన తర్వాతే రాఖీ కట్టడం( Tie Rakhi ) మంచిదని చెబుతున్నారు.ఒక వేళ ఆగస్టు 30వ తేదీన రాఖీ కట్టాలని అనుకుంటే రాత్రి 9 గంటల 15 నిమిషాముల తర్వాత శుభముహూర్తం( Rakhi Festival Timings ) మొదలవుతుందని చెబుతున్నారు.అలాగే ఆగస్టు 31వ తేదీన ఉదయం ఏడు గంటల ఐదు నిమిషముల వరకు మాత్రమే రాఖీ కట్టే శుభ సమయం ఉంటుంది.ఈ వ్యవధిలో పండుగ జరుపుకోవచ్చని పండితులు చెబుతున్నారు.
అందువల్ల ఈ సంవత్సరం రాఖీ పండుగను ఆగస్టు 30, 31వ తేదీలలో జరుపుకోనున్నారు.
LATEST NEWS - TELUGU