తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ సమీరారెడ్డి ( Sameera reddy )గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె తెలుగులో పలు సినిమాలలో నటించి హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది.
అశోక, జై చిరంజీవ వంటి సినిమాలలో నటించి ప్రేక్షకులకు చేరువయ్యింది.ఆ తర్వాత కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో పెళ్లి చేసుకుని సినిమాలకు పూర్తిగా దూరమైంది.
సోషల్ మీడియాకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకు తన భర్త, పిల్లలకు సంబంధించిన ఫోటోలు వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది.

ఇంటర్వ్యూలో పాల్గొన్న సమీరా రెడ్డి అక్షయ్‌తో వివాహం, పిల్లలు, తనకు ఎదురైన విమర్శల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది.ఈ సందర్భంగా సమీరా రెడ్డి మాట్లాడుతూ.2014లో అక్షయ్( Akshai )తో నాకు వివాహమైంది.మా ఇంటి టెర్రస్ పైనే చాలా సింపుల్‌గా మా పెళ్లి జరిగింది.నేను ప్రెగ్నెంట్‌ని అయ్యానని, అందుకే హడావుడిగా పెళ్లి చేసుకున్నానని పలువురు మాట్లాడుకున్నారు.వాళ్ల మాటల్లో నిజం లేదు.ఇరు కుటుంబ పెద్దల అంగీకారంతోనే మా పెళ్లి సింపుల్‌గా జరిగింది.ఫస్ట్ ప్రెగ్నెన్సీ సమయంలో నేను ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను.2015లో బాబు పుట్టిన తర్వాత భారీగా బరువు పెరిగాను.

శరీరాకృతి విషయంలో చుట్టుపక్కల వాళ్లు నన్ను కామెంట్ చేశారు.చివరికి కూరగాయలు అమ్మే వ్యక్తి కూడా, దీదీ మీకు ఏమైంది? ఇది మీరేనా? అని అన్నాడు.వాళ్ల విమర్శలు నన్ను ఎంతో భయపెట్టాయి.ఫొటోగ్రాఫర్స్ కు కనిపించకూడదనే ఉద్దేశంతో కొంతకాలం బయటకు కూడా వెళ్లలేదు.వ్యక్తిగత జీవితంలో ఫుల్ బిజీ అయిపోయిన నేను, ఎలా అయినా తిరిగి అభిమానులతో కనెక్ట్ కావాలనుకున్నాను.అందుకు సోషల్ మీడియా ( Social media )సులువైన మార్గం అనిపించింది.
ఇన్‌స్టాలో అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత దాన్ని కాస్త ప్రమోట్ చేయాలని ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న స్నేహితులకు ఫోన్ చేశాను.ఒక్కరు కూడా నాకు సాయం చేయలేదు.
బాధగా అనిపించిందిఅని ఆమె చెప్పుకొచ్చింది.







