కేంద్రంపై విపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని వైసీపీ వ్యతిరేకించింది.ఈ క్రమంలో ఇవాళ జరిగిన అవిశ్వాస తీర్మానం చర్చలో వైసీపీ లోక్ సభాపక్ష నేత మిథున్ రెడ్డి పాల్గొన్నారు.
కేంద్రంపై విపక్షాల అవిశ్వాసానికి విలువ లేదని వైసీపీ భావిస్తుందని ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు.అధికార ఎన్డీఏకి పూర్తి మెజారిటీ ఉందన్న ఆయన రెండు కూటముల మధ్య రాజకీయాల కోసమే అవిశ్వాస తీర్మానమని వెల్లడించారు.
మణిపుర్ లో మహిళలపై అత్యాచార ఘటనలు బాధాకరమన్నారు.ఈ ఘటనకు కారణమైన దోషులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
మణిపుర్ ఘటనలు అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్టను దిగజార్చాయన్నారు.కేంద్రం మణిపుర్ లో శాంతిని పునరుద్ధరించాలని ఆయన కోరారు.