స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) ఆస్తుల విలువ 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తమనే సంగతి తెలిసిందే.ఒక్కో సినిమాకు 5 కోట్ల రూపాయల రేంజ్ లో సమంత పారితోషికం తీసుకుంటున్నారు.
యాడ్స్, స్పెషల్ సాంగ్స్, సోషల్ మీడియా ప్రమోషన్స్ ద్వారా సమంత మరింత ఎక్కువ మొత్తం సంపాదిస్తున్నారు.ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత వచ్చే ఏడాది సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి కెరీర్ పరంగా బిజీ అవుతానని నమ్మకంతో ఉన్నారు.
అయితే ఈ మధ్య కాలంలో సమంత గురించి కొన్ని ఫేక్ వార్తలు( Fake News ) ప్రచారంలోకి వచ్చాయి.మయోసైటిస్ చికిత్స ఖరీదైనదని ఈ చికిత్స కోసం సమంత స్టార్ హీరో దగ్గర రూ.25 కోట్లు అప్పు చేసిందని వైరల్ అయిన వార్తల సారాంశం.అయితే తన పరువుకు భంగం కలిగించేలా ఉన్న ఈ వార్త సోషల్ మీడియాలో జోరుగా ప్రచారంలోకి రావడంతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఈ విషయాన్ని ప్రచారం చేయడంతో సమంత ఈ వార్తల గురించి స్పందించారు.తనపై భవిష్యత్తులో ఈ తరహా వార్తలు మళ్లీ మళ్లీ ప్రచారంలోకి రాకుండా ఈ తరహా వార్తలు ప్రచారం చేసేవాళ్లకు బుద్ధి వచ్చేలా సమంత తన ఇన్ స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టారు.మయోసైటిస్ చికిత్స( Myositis Treatment ) కోసం రూ.25 కోట్ల అప్పు తీసుకున్నానని ఆ మొత్తాన్ని చికిత్స కోసం ఖర్చు చేస్తున్నానని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని సమంత తెలిపారు.ఎవరో తప్పుడు సమాచారం ఇవ్వడం వల్లే ఈ ప్రచారం జరుగుతోందని ఆమె అన్నారు.
మయోసైటిస్ వ్యాధి చికిత్స కొరకు తాను ఖర్చు చేసిన డబ్బు చాలా తక్కువ మొత్తమేనని సినీ కెరీర్ ద్వారా సంపాదించిన డబ్బంతా ఈ వ్యాధి చికిత్స కోసం ఖర్చు చేశానని నేను ఫీల్ కావడం లేదని సమంత అన్నారు.నా జాగ్రత్తలు నేను చూసుకోగలనని సామ్ చెప్పుకొచ్చారు.మయోసైటిస్ అనే సమస్య వల్ల వేల సంఖ్యలో ప్రజలు బాధ పడుతున్నారని సమంత క్లారిటీ ఇచ్చారు.
మయోసైటిస్ చికిత్సకు సంబంధించిన వార్తలను ప్రచారం చేసేముందు ఒకింత బాధ్యతతో వ్యవహరించాలని సామ్ కోరారు.
సమంత క్లారిటీ నేపథ్యంలో ఇకనైనా ఈ తరహా వార్తలు ఆగిపోతాయేమో చూడాలి.సమంత గురించి ఫేక్ వార్తలు ప్రచారం చేసేవాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సామ్ అభిమానులు ఫీలవుతున్నారు.