వైరల్: చెక్కలతో తయారు చేసిన ఎత్తైన టవర్ ఆఖరికి అలా కూలిపోయింది!

టవర్ ( Tower ) అంటే అదేదో నిజమైన టవర్ అనుకునేవారు కాబోలు.కాదుకాదు… అది చెక్కలతో( Wood ) తయారు చేసిన ఓ ఎత్తైన టవర్.విషయంలోకి వెళితే, యూకేలో చెక్క దిమ్మెలతో తయారుచేసిన అత్యంత ఎత్తైన టవర్ ను కూల్చివేసిన వీడియోని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్( Guinness World Record ) ట్విట్టర్‌లో షేర్ చేసింది.దాంతో ఆ వీడియోని చాలామంది చాలా ఆసక్తిగా తిలకిస్తున్నారు.

 Huge Domino Structure Comes Tumbling Down After Guinness World Record Details, W-TeluguStop.com

సోషల్ మీడియాలో డొమినో ఎఫెక్ట్‌ ను కలిగి ఉన్న వీడియోలను చూడటానికి చాలా మంది రెడీగా వుంటారు.డొమినో ఎఫెక్ట్‌ అంటే ఒక వస్తువును కదలించడం ద్వారా చైన్ రియాక్షన్ తో ముందు వరుసలో ఉండే వస్తువులను పడేలా చేస్తుంది.

ఇలాంటి వీడియోలు ప్రజలను చాలా ఆకట్టుకుంటాయి.అంతేకాకుండా ఇలాంటి డొమినోలు రకరకాలుగా తయారుచేస్తుంటారు.

కాగా తాజాగా.బెంజమిన్ క్రౌజియర్( Benjamin Crouzier ) మరియు అతని బృందం ఈ డొమినోను సృష్టించారు.ఆ వీడియోలో చెక్క దిమ్మెల బ్లాకులను వేలసంఖ్యలో వాడారు.ఒలింపియా లండన్ (UK) లో 27.46 మీటర్ల ఎత్తులో చెక్క దిమ్మెల బ్లాకులతో ఎత్తైన టవర్‌ను తయారు చేసినందుకు బెంజమిన్ క్రౌజియర్ మరియు అతని బృందానికి జనాలు అభినందనలు తెలిపారు.ఈ వీడియోను జూలై 27న ట్విట్టర్ లో పోస్ట్ చేయగా.

ఇప్పటివరకు దాదాపుగా 93,100 మంది చూశారు.ఇంకా వీడియోను చూస్తున్నారు.

కట్ చేస్తే వారు చేసిన పని ఒక రికార్డుగా గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకుంది.ఈ వీడియోపై ఒక నెటిజన్ చాలా ఆసక్తికరంగా కామెంట్ చేయడం ఇక్కడ మనం చూడవచ్చు, ‘వస్తువులను నిర్మించడానికి చాలా రోజులు పడుతుంది, కానీ దానిని నాశనం చేయడానికి సెకన్లు పడుతుంది.’ అని రాసుకొచ్చాడు.

సోషల్ మీడియాలో ఎక్కువగా ఇటువంటి వీడియోలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది.అందుకే చాలామంది క్రియేటర్లు ఇటువంటి వీడియోలు చేసి సొమ్ము చేసుకుంటూ వుంటారు.మనదేశంలో కూడా తాజ్ మహల్, చార్మినార్ వంటివాటిని ఇలా చెక్కలతో తయారు చేసినవారు కూడా వున్నారు.

అయితే అవి రికార్డ్స్ వరకు వెళ్ళలేదు.మరికొంతమంది అందమైన ఇళ్లను నిర్మిస్తూ వుంటారు.

ఒకచోట ఒక బ్రిక్ ని పడవేస్తే… సెకెన్ల వ్యవధిలో మిగతా కట్టడం అంతా కూడా చాలా అందంగా కూలిపోతూ ఉంటుంది.ఆ దృశ్యాలను మనోళ్లు స్లో మోషన్లో షూట్ చేస్తూ వుంటారు.

దాంతో నెటిజన్లు చూడడానికి చాలా ఆసక్తికరంగా మారుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube