బ్రో మూవీ( Bro Movie ) రిలీజ్ రోజు టాక్ కు తర్వాత టాక్ కు చాలా తేడా ఉందనే సంగతి తెలిసిందే.బ్రో మూవీ కమర్షియల్ గా మరీ భారీ స్థాయిలో సక్సెస్ సాధించే అవకాశాలు అయితే లేవు.
రీమేక్ మూవీ కావడం, నిడివి తక్కువగా ఉండటం, మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ కావడం, కమర్షియల్ సినిమాకు అవసరమైన కథ, కథనం లేకపోవడం ఈ సినిమా యావరేజ్ రిజల్ట్ కు కారణమైందని చెప్పవచ్చు.
పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మ్యనియా తొలిరోజు వరకు పని చేసినా రెండో రోజు నుంచి కలెక్షన్లను రాబట్టడంలో బ్రో ఫెయిలవుతుంది.
సముద్రఖని డైరెక్షన్, త్రివిక్రమ్ మాటలు బ్రో సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా చేయడంలో ఫెయిలయ్యాయి.అయితే బ్రో సినిమా కోసం మొదట పరిశీలించిన పేర్లు పవన్ సాయితేజ్ కాదని తెలుస్తోంది.
ప్రభాస్,( Prabhas ) అఖిల్ లను( Akhil ) మొదట ఈ సినిమా కోసం పరిశీలించారని భోగట్టా.
ఈ సినిమా కోసం సూర్య కార్తీ పేర్లను( Surya, Karthi ) సైతం సముద్రఖని పరిశీలించారని సమాచారం.ఆ తర్వాత పవన్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో ఈ సినిమాకు సంబంధించిన ప్రతిపాదన రాగా వరుణ్ తేజ్ ప్లేస్ లో సాయితేజ్ ఎంపిక కావడం జరిగింది.పవన్ సాయితేజ్ నటించడం వల్ల ఈ సినిమా బడ్జెట్ సైతం అమాంతం పెరిగింది.
అయితే ఇప్పటికే వినోదయ సిత్తం సినిమాను చూసిన వాళ్లు ఈ సినిమాపై ఆసక్తి చూపలేదు.
త్రివిక్రమ్ చేసిన మార్పులు ఈ సినిమాకు మైనస్ అయ్యాయే తప్ప ప్లస్ కాలేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.త్రివిక్రమ్ ఈ మధ్య కాలంలో వరుసగా విమర్శల పాలవుతున్నారు.బ్రో సినిమా రిజల్ట్ నేపథ్యంలో గుంటూరు కారం సినిమాకు తెరకెక్కిస్తున్న త్రివిక్రమ్ పై మహేష్ ఫ్యాన్స్ ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
గుంటూరు కారం( Guntur Karam ) సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటుందో చూడాలి.