కంప్లైంట్లు చేసి విసుగెత్తిపోయాడు.. చివరికి ఆఫీసర్ టేబుల్‌పై పాము విసిరేశాడు!

హైదరాబాద్‌లో( Hyderabad ) ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి.నగరంలో చాలా ప్రాంతాలు నీట మునిగాయి.

 He Complained And Got Frustrated Finally He Threw The Snake On The Officer's Tab-TeluguStop.com

దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ తరుణంలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది.

మున్సిపల్ కార్పొరేషన్ ( Municipal Corporation )అధికారులకు ఓ వ్యక్తి షాకిచ్చాడు.ఈ వ్యక్తి తన ఇంట్లో పాము ఉందని, దానిని పట్టుకోవాలని మున్సిపల్ కార్పొరేషన్‌కు పలుమార్లు ఫిర్యాదు చేశాడు.

ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోలేదని ఆ యువకుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు.చివరికి చిర్రెత్తుకొచ్చి ఆ వ్యక్తి స్వయంగా పామును పట్టుకున్నాడు.

అంతే కాదు ఈ పాముతో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకుని అక్కడి అధికారుల టేబుల్‌పై పామును వదిలేశాడు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

బీజేపీ నేత విక్రమ్ గౌర్ ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.‘మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు హైదరాబాద్‌లోని అల్వాల్‌లో( Alwal, Hyderabad ) ఎలాంటి విచారణ జరపడం లేదు.ఓ వ్యక్తి పామును పట్టుకుని జీహెచ్‌ఎంసీ వార్డు( GHMC Ward ) కార్యాలయానికి చేరుకుని పామును అక్కడే వదిలేశాడు.వర్షం కురుస్తున్న సమయంలో ఈ పాము అతని ఇంట్లోకి ప్రవేశించింది.

ఎన్ని సార్లు జీహెచ్‌ఎంసీకి కంప్లయింట్ చేసినా వారు పట్టించుకోకపోవడంతో విసుగెత్తి ఇలా చేశాడు’ అని పేర్కొన్నారు.అయితే ఆఫీస్ టేబుల్‌పై పామును వేశాక అధికారులు భయపడ్డారు.తమ ఆఫీసు నుంచి బయటకు పరుగులు పెట్టారు.

ప్రస్తుతానికి ఈ విషయమై మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.పాము దాదాపు 5 అడుగుల పొడవు ఉన్నట్లు వీడియోలో చూడవచ్చు.మరోవైపు పామును పట్టుకుని తీసుకొచ్చిన వ్యక్తి కూడా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో వాగ్వాదానికి దిగాడు.

ఏదేమైనా ఆ యువకుడు చేసిన పనిని చాలా మంది ప్రశంసిస్తున్నారు.ఏదైనా సమస్య ఉందని చెబితే ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదని, అలాంటి వారికి ఆ యువకుడు తగిన గుణపాఠం నేర్పాడని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube