శ్రీ భగవతా పురాణం, కల్కి పురాణం( Kalki Purana ) ప్రకారం కలియుగం, సత్యాయుగం సంధికాలంలో కల్కి భగవానుడు అవతరిస్తాడు.శ్రీమహావిష్ణువు అవతారం 64 కళలతో నిండి ఉంటుంది.
దుష్టులను శిక్షించడానికి మరియు పాపం పరిమితులను అధిగమించి ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి కల్కి భగవానుడు అవతరిస్తాడని పండితులు చెబుతున్నారు.భాగవతంలోని ద్వాదశ స్కంధం రెండవ అధ్యాయంలో కల్కి భగవానుడి అవతారం గురించి పూర్తిగా వివరించారు.
శంభల” అనే గ్రామంలో విష్ణుయశస్సు అనే బ్రాహ్మణుడు ఇంట కల్కి జన్మిస్తాడు.వీర ఖడ్గం ధరించి తెల్ల గుర్రంపై స్వారీ చేస్తూ దుష్ట శిక్షణ చేసి తిరిగి సత్యయుగాన్ని స్థాపిస్తాడని చెబుతారు.కలియుగంలో పాపభారం అంతకంతకు పెరిగిపోతుందని ఆ సమయంలో తను కల్కి గా అవతరించి ధర్మ సంరక్షణ చేస్తానని శ్రీమహావిష్ణువు చెప్పినట్లు పురాణాలలో ఉంది.కృతయుగం నుంచి ఇప్పటివరకు శ్రీ మహావిష్ణువు 9 అవతారాలు ఎత్తాడు.
రామావాతరం( Lord rama ) పూర్తయ్యాక కృష్ణ అవతారంలో శ్రీ మహావిష్ణువు కనిపించాడు.ద్వారకా నీట మునిగి కృష్ణుడు అవతారంచాలించిన తర్వాత నుంచి కలియుగం మొదలైంది.
ఇప్పుడు కలియుగంలో మాత్రం ధర్మం ఒక పాదం పై నడుస్తోంది.ఇక ధర్మం అనే మాట వినిపించని రోజున కల్కి అవతారంలో వచ్చి శ్రీమహావిష్ణువు దుష్ట శిక్షణ చేస్తాడని పండితులు చెబుతున్నారు.ఇంతకీ శ్రీ మహా విష్ణువు( Lord vishnu ) పదో అవతారం అయినా కల్కి ఎప్పుడు వస్తాడో ఇప్పుడు తెలుసుకుందాం.ఎక్కడ దైవ పూజ ఉండదు.యజ్ఞయాగాదుల మాటే వినిపించదు.గోవులను వధిస్తూనే ఉంటారు.
లోకులంతా మాంసాన్ని భక్షిస్తారుతల్లిదండ్రులను చూసే బిడ్డలు ఉండరు.భూమి మీద ఉన్న మనుషులంతా ఒక వ్యాధి బారిన పడతారు.
ఒళ్లంతా పుండ్లు వాటి నుంచి నెత్తురు కారుతూ పురుగుల లాగా మనుషులంతా అంతరించిపోతూ ఉంటారు.ఎక్కడ చూసినా వ్యాధులతో మంచం పట్టిన వారే కనిపిస్తారు.
పరమ పుణ్యాత్ములు అనేవారు మాత్రమే ఆరోగ్యకరమైన శరీరాలతో ఉంటారు.ఇలాంటి సమయంలో అవతరించిన కల్కి దుష్ట శిక్షణ చేసి కలియుగాన్ని అంతం చేసి తిరిగి కృత యుగాన్ని ప్రారంభిస్తాడు.
అప్పుడు ప్రళయం ముంచుకొచ్చి భూమి నాశనం అయిపోతుంది.
DEVOTIONAL