జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్ పరోక్షంగా స్పందించారు.మంచి చేస్తున్న వ్యవస్థలను అవమానించడం సంస్కారం కాదని చెప్పారు.
సంస్కారం ఉన్నవారు వాలంటీర్లను అవమానించరని తెలిపారు.వాలంటీర్లు మన కుటుంబ సభ్యులన్న సీఎం జగన్ వాలంటీర్లు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలను అందిస్తున్నారని పేర్కొన్నారు.
అటువంటి వాలంటీర్లపై కొందరు తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.వాలంటీర్లు కొత్త వారు కాదన్న జగన్ మన ఊరు వారేనన్నారు.
వాలంటీర్లపై తప్పుడు వ్యాఖ్యలకు నిర్మాత చంద్రబాబేనన్నారు.కానీ నటన, మాటలు అన్నీ దత్తపుత్రుడివి అంటూ విమర్శించారు.
చంద్రబాబుకు పదేళ్లుగా ప్యాకేజీ స్టార్ వాలంటీర్ గా చేస్తున్నారని ఎద్దేవా చేశారు.