జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) నీ బీజేపీ అధికమాండ్ ఢిల్లీకి రావాలని పిలుపునిచ్చింది.జులై 18వ తారీకు ఎన్డీఏ భాగస్వామ్యుల రాజకీయ పక్షాల అగ్ర నేతలు సమావేశం కాబోతున్నారు.
ఈ క్రమంలో బీజేపీ ( BJP )పార్టీకి మిత్రపక్షంగా ఉన్న జనసేనకు కూడా ఆహ్వానం అందింది.దీంతో జులై 17వ తారీకు సాయంత్రం జనసేన పార్టీ రాష్ట్ర వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో కలసి పవన్ ఢిల్లీ చేరుకోనున్నారు.
ఏపీలో మరో 10 నెలలలో ఎన్నికలు జరగనున్నాయి.
ఈ క్రమంలో ఎన్డీఏ( NDA ) భాగస్వాముల సమావేశంలో జనసేనకు కూడా స్థానం కల్పించడం సంచలనంగా మారింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారాహి విజయ యాత్రతో పవన్ కళ్యాణ్ రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్నారు.అధికార పార్టీ వైసీపీ ( YCP )నేతలపై మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ నీ టార్గెట్ చేసుకుని పవన్ చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి.
ఇటువంటి తరుణంలో ఎన్డీఏ భాగస్వాముల సమావేశానికి బీజేపీ హైకమాండ్ నుంచి పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం అందడంతో జనసేన నేతలు మరియు కార్యకర్తలలో ఫుల్ జోష్ నెలకొంది.ఎన్డీఏ సమావేశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ హాజరుపై… పార్టీ ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది.