పవన్‌ వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్నినాని కౌంటర్ ఎటాక్ చేశారు

పవన్‌ వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేరు నాని కౌంటర్ ఎటాక్ చేశారు.ఆట విడుపుగానే పవన్ జనసేన అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారని ఎద్దేవా చేసిన ఆయన.

 Former Minister Parninani Counter-attacked On Pawan's Comments Peni Nani, Ap Po-TeluguStop.com

పవన్ఏలూరు సభలో తన మాటలకు విషం కలిపి మాట్లాడారని మండిపడ్డారు.జగన్‌పై ద్వేషం.

చంద్రబాబుపై ప్రేమ. పవన్( Pawan kalyan ) మాటల్లో కన్పించిందని విమర్శించారు.30 వేల మంది ఒంటరి మహిళలు అదృశ్యమయ్యారని.ఈ లెక్కలు NCB.పవన్ నుంచి వచ్చిందని చెప్పారు.NCRB లెక్కలైతే పవన్ కరెక్టుగానే చెప్పాడు.

కానీ, NCB లెక్కల కాబట్టే ఈ కామెంట్లు చేశాడని ఫైర్‌ అయ్యారు.

ప్రజలను నమ్మించే ప్రయత్నంలో భాగంగా పవన్ విషం చిమ్మారని ఆగ్రహం వ్యక్తం చేశారు పేర్నినాని( Perni nani ).ప్రేమ వ్యవహరంలో ఇంట్లో వాళ్ల మీద అలిగి ఇళ్ల నుంచి వెళ్లేవారు ఎక్కువగా ఉంటారు.దీనిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకుంటారు.

చంద్రబాబు హయాంలో 16 వేలకు పైగా మహిళలు మిస్ అయినట్టు ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయని NCRB లెక్కలు చెబుతున్నాయి.కానీ, ఇప్పుడు తప్పుడు లెక్కలు.

విషపు మాటలతో పవన్ సభలు పెడుతున్నారని దుయ్యబట్టారు.చంద్రబాబు ఏం మాట్లాడమంటే అదే మాట్లాడుతున్నారు.

జగన్ ఏర్పాటు చేసిన వలంటీర్లు.సచివాలయ వ్యవస్థ అంటే చంద్రబాబుకు, పవన్‌కు వణుకు అని విమర్శించారు.

జగన్‌పై ఎన్నో తప్పుడు కేసులు పెట్టినా ప్రజల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు.అక్కసు, ఆక్రోశంతో వాలంటీర్లను చెడ్డవాళ్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

పవన్ నాలుకకు నరం లేదు.

నోటికి శుద్ధి లేదని ఫైర్‌ అయ్యారు.

వలంటీర్లు వ్యవస్థను రద్దు చేసి జన్మభూమి కమిటీలు పెడతామని చంద్రబాబు, పవన్‌లు చెప్పగలరా.?దమ్ముంటే వాలంటీర్ల వ్యవస్థ రద్దు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టగలరా.?అని చాలెంజ్‌ చేశారు మాజీ మంత్రి పేర్నినానిఇక, వాలంటీర్లల్లలో 1.90 లక్షల మంది మహిళలే.వాలంటీర్లు మహోన్నత సేవా కార్యక్రమాలు చేస్తోంటే నీచంగా మాట్లాడతారా.?అంటూ పవన్‌ను నిలదీశారు పేర్నినాని.మనిషన్నవాడు సేవ చేసే పిల్లల గురించి నిందలేస్తూ కామెంట్లు చేస్తారా.?దిక్కుమాలిన రాజకీయం కోసం ఇంతటి నీచానికి ఒడిగట్టాలా.?అంటూ ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు మాజీ మంత్రి పేర్నినాని.కాగా, ఏపీలో మహిళల అదృశ్యం, వాలంటీర్ల వ్యవస్థపై జనసేన అధినేత పవన్ ‌కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది.

ఇప్పటికే ఏపీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది.మహిళల మిస్సింగ్ ఆరోపణలపై ఆధారాలివ్వాలని స్పష్టం చేసింది.అయితే, ఏలూరు సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.ఏపీలో కనపడకుండా పోయిన 29 వేల మందికిపైగా మహిళల వెనుక వాలంటీర్లు ఉన్నారని కేంద్ర నిఘా వర్గం చెప్పిందని ఆరోపణలు గుప్పించారు.

ఒంటరిగా, భర్త లేని, బాధల్లో ఉన్న మహిళలను వెతికి పట్టుకోవడం, ట్రాప్‌ చేయడం, బయటకు తీసుకెళ్లడం, మాయం చేయడం ఇదే వలంటీర్ల పని అనితీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube