ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయ సమీకరణాలు రోజురోజుకి మారిపోతున్నాయి.క్షేత్ర స్థాయిలో నారాలోకేష్ పాదయాత్ర వైసీపీ ప్రభుత్వం పై ఎంత ప్రభావం చూపిస్తుందో చెప్పలేము కానీ, పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ‘వారాహి విజయ యాత్ర’ ( Varahi Vijaya Yatra ) మాత్రం చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది.
ప్రారంభించి కేవలం పది రోజులు మాత్రమే అయ్యింది.ఈ పది రోజుల్లో రాజకీయాల్లో పుట్టిన వేడి ఇంతకు ముందు ఎన్నడూ కూడా పుట్టలేడనే చెప్పాలి.
ముఖ్యంగా ‘వారాహి విజయయాత్ర’ సభలకు తరళి వస్తున్న జనాలను చూస్తే ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తక తప్పదు.అడుగడుగునా పవన్ కళ్యాణ్ కి మహిళలు హారతులు పట్టి నీరాజనాలు పలుకుతున్నారు.
యువత దగ్గర నుండి పెద్ద వయస్సు ఉన్న వాళ్ళ వరకు ప్రతీ ఒక్కరు పవన్ కళ్యాణ్ సభలకు హాజరు అవుతున్నారు.ఇదంతా పవన్ కళ్యాణ్ కి మామూలే కదా, కొత్తగా జరుగుతున్నది ఏంటి అని అనుకుంటే పొరపాటే.
గత ఎన్నికలతో పోలిస్తే ప్రతీ ఒక్కరిలో కసి పెరిగింది, ప్రేమ కనిపిస్తుంది.ఇంత ఉత్సాహం, ఇంత కసి గతం లో ఉండేది కాదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ సభలకు వస్తున్న జనాలలో అధిక శాతం మంది ఓట్లు వేస్తారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.ఇక పోతే సభలలో పవన్ కళ్యాణ్ వైసీపీ పార్టీ ప్రభుత్వం( YCP Govt ) చేస్తున్న స్కామ్స్ ని వెలికితీసి, చాలా బలమైన గొంతుతో మాట్లాడిన మాటలు జనాలకు ఒక రేంజ్ రీచ్ అవుతున్నాయి.పవన్ కళ్యాణ్ లేవదీస్తున్న ఈ స్కామ్స్ గురించి వైసీపీ ప్రభుత్వం నుండి కూడా పెద్దగా కౌంటర్లు రావడం లేదు.
ఎక్కడ కౌంటర్ ఇస్తే దొరికిపోతామో అని భయపడుతూ, పవన్ కళ్యాణ్ ఆవేశం తో మాట్లాడే మాటలైనా ‘తాట తీస్తా.తోలు తీస్తా’ లాంటి మాటలనే ఎక్కువగా హైలైట్ చేస్తున్నారు.
వైసీపీ పార్టీ నాయకులు కూడా దీనిమీదనే కౌంటర్లు ఇస్తున్నారు కానీ, పవన్ కళ్యాణ్ నిన్న అమలాపురం సభలో ‘అంబేద్కర్ విదేశీ విద్య’ అనే పధకానికి నీ పేరు ఎందుకు పెట్టుకున్నావు జగన్ మోహన్ రెడ్డి, నువ్వు అంబేద్కర్ కంటే గొప్పవాడివా అని పవన్ కళ్యాణ్ అన్నమాటకు వైసీపీ నుండి ఎలాంటి కౌంటర్ కూడా లేదు.
ఇది ఇలా ఉండగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఎప్పటికప్పుడు ‘వారాహి యాత్ర’ కి గ్రౌండ్ లెవెల్ లో వస్తున్న రెస్పాన్స్ ని ప్రత్యేక బృందం ద్వారా సర్వే చేయించి తెలుసుకుంటున్నాడట.వాళ్ళు అందిస్తున్న సమాచారం ప్రకారం రోజు రోజుకి పవన్ కళ్యాణ్ గ్రాఫ్ జనాల్లో భారీగా పెరుగుతూ పోతుందని, ఇదే జోష్ తో ఆయన కోస్తాంధ్ర మొత్తం వారాహి యాత్ర ని కొనసాగిస్తే వైసీపీ పార్టీ అకౌంట్ కూడా ఓపెన్ చెయ్యని పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు.ఇందుకోసం జగన్ తనదైన శైలిలో రాజకీయ మొదలు పెట్టాడు.
పవన్ కళ్యాణ్ సామజిక ఓట్లను చీల్చేందుకు ఆయన సామాజిక వర్గానికే చెందిన ముద్రగడ్డ పద్మనాభం ని పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా ఉత్తరాలు రాయిస్తున్నారట.ఈ లెక్కన కాపు సామజిక వర్గపు ఓట్లను చీల్చి మళ్ళీ పవన్ కళ్యాణ్ ని ఓడిపొయ్యేలా చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారట, మరి వాళ్ళ వ్యూహాలు సఫలం అవుతాయో, విఫలం అవుతాయో చూడాలి.