వారు గతాన్ని తప్ప భవిష్యత్తును చూడలేరు: రాహుల్ గాంధీ

బాలాసోర్( Balasore ) రైలు ప్రమాదం పై భాజపాపై తీవ్ర విమర్శలు గుప్పించారు రాహుల్ గాంధీ( Rahul Gandhi ).అమెరికా పర్యటన లో ఉన్న ఆయన భారతీయ ప్రవాస్ కాంగ్రెస్ న్యూయార్క్( Congress New York ) లో ఏర్పాటు చేసిన ఒక సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు .

 Rahul Fires On Bjp Towards Train Accident Issue , Balasore, Rahul Gandhi, Congr-TeluguStop.com

బాజపా కానీ దాని మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ గాని భవిష్యత్తును చూసే దృక్పథంలో లేవని వారు గతాన్ని మాత్రమే చూస్తారు అంటూ ఆయన విమర్శలు చేశారు.

Telugu Balasore, British, Congress York, India, Rahul Bjp Train, Rahul Gandhi-Te

భారతదేశమనేది ఒక కారు అయితే వారు ముందు గ్లాసుల నుంచి చూడటం మానేసి వెనుక దృశ్యాలను చూపే రియల్ వ్యూ మిర్రర్ ను చూసి దేశాన్ని నడుపుతున్నారంటూ ఆయన చెప్పుకొచ్చారు.మీరు ఏదైనా ఒక విషయంపై విమర్శ చేస్తే వారి వెంటనే మీ గతంలోకి తొంగు చూసి తిరిగి విమర్శలు చేస్తుంటారు.ప్రస్తుతం భారతదేశంలో( India ) జరుగుతున్న ఏదైనా ఒక అవినీతి నీ గాని వ్యవస్త ని గాని మీరు విమర్శిస్తే వారు 60 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన ఉదాహరణగా చూపిస్తారు అని ఎద్దేవా చేశారు .

Telugu Balasore, British, Congress York, India, Rahul Bjp Train, Rahul Gandhi-Te

ఇప్పుడు బాలాసోర్ లో జరిగిన రైలు ప్రమాదం గురించి విమర్శిస్తుంటే కాంగ్రెస్ హయాంలో జరిగిన రైలు ప్రమాదాల గురించి వారు ప్రస్తావిస్తున్నారని .కాంగ్రెస్ హయాంలో జరిగిన రైల్వే ప్రమాదాలలో ఆ మంత్రి తప్పించుకోలేదని ప్రమాదానికి కారణం బ్రిటిష్( British ) వారిపై పెట్టలేదని నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశారని అలాంటి జవాబు దారి తనం గాని, నిజాయితీ గాని మీ దగ్గర ఉందా ?? అంటూ ఆయన ప్రశ్నించారు.వ్యవస్థలను భయపెట్టడం, ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయటమే తప్ప ప్రజల క్షేమం పట్ల చిత్తశుద్ధి మీకు లేదంటూ ఆయన విమర్శలు చేశారు.మీ ప్రచార గీమ్మిక్కులు ప్రజలు గమనిస్తున్నారని అభివృద్ధి గురించి ఆలోచించకుండా కేవలం మతవిద్వేషాలు రెచ్చగొట్టి గెలవాలనుకుంటున్న మీ విధానాలను ప్రజలు అర్థం చేసుకున్నారని వచ్చే ఎన్నికల్లో మీకు తగిన గుణపాఠం చెపుతారంటూ ఆయన చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube