చైనా వల్ల ప్రపంచానికి మరో ముప్పు.. ఆ ప్రయోగం కొంపముంచుతుందా..?

ఇప్పటికే కరోనా వైరస్‌కు సంబంధించి చైనాపై ( China )ప్రపంచ దేశాలు అనేక ఆరోపణలు చేశాయి.ఇతర దేశాల ఆర్ధిక వ్యవస్థను బలహీనం చేసేందుకు చైనా ప్రయోగించిన బయో వార్‌గా( Bio War ) కొంతమంది అనుమానిస్తున్నారు.

 China Digging A 10km Hole Through The Earth Crust Details, China, Another Threat-TeluguStop.com

చైనా కావాలనే వ్యూహన్ ల్యాబ్‌లో కరోనా వైరస్ తయారు చేసిందని, ప్రపంచ దేశాలను నాశనం చేసేందుకు ఆ వైరస్‌ను బయటకు లీక్ చేసిందనే ఆరోపణలు ఆ దేశంపై ఉన్నాయి.ప్రపంచ దేశాలు కూడా చైనానే కరోనా వైరస్‌ను తయారుచేసినట్లు నమ్ముతున్నాయి.

Telugu Km Hole, Threat, China, China Km Hole, China Threat, Corona, Earth Crust,

కరోనా వైరస్ వల్ల ప్రపంచం ఒక్కసారిగా అతలాకుతలమైంది.అన్నీ బంద్ కావడంతో దేశాలన్నీ తీవ్రంగా నష్టపోయాయి.ఆర్ధికంగా దేశాలన్నింటికీ బాగా నష్టం జరిగింది.అలాగే ఈ వైరస్ ధాటికి లక్షల మంది తమ ప్రాణాలు కోల్పోయారు.చైనాలోనే కరోనా తొలిసారిగా బయటపడటంతో.ఆ దేశం తీవ్ర విమర్శలను ఎదుర్కొంది.

అయితే అలాగే ఇప్పుడు చైనా మరోసారి ప్రపంచ దేశాల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది.దానికి కారణం భూమి లోపల 10 కిలోమీటర్ల పొడవున రంద్రం వేయడానికి చైనా ప్రయత్నిస్తోంది.

భూమి లోపల 10 కిలోమీటర్లు తవ్వితే దాని ప్రభావం వల్ల భూకంపాలు ( Earthquakes ) వచ్చి ప్రపంచానికే నష్టం జరిగే అవకాశముంటుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు.చైనా వల్ల ప్రపంచానికే ముప్పు ఏర్పడే అవకాశముంటుందని చెబుతున్నారు.

Telugu Km Hole, Threat, China, China Km Hole, China Threat, Corona, Earth Crust,

అయితే భూమి లోపల 10 కిలోమీటర్ల మేర రంధ్రం వేయాల్సిన అవసరం చైనాకు ఏముందనే చర్చ జరుగుతోంది.దాదాపు చిన్నపాటి పట్టణం ఉండేలా పెద్ద తవ్వకాన్ని భూమి లోపల చైనా మొదలుపెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.ఆయిల్ నిక్షేపాలు, బంగారం నిక్షేపాలు కోసం తవ్వుతున్నారని కొంతమంది అంటుండగా.సరికొత్త అణ్వస్త్రాన్ని భూమి లోపల ప్రయోగిస్తున్నట్లు మరికొందరు అనుమానిస్తున్నారు.దీని వల్ల భూమిపై ప్రమాదం ఏర్పడి ప్రపంచానికి మరో ప్రళయం ముంచుకొస్తుందని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube