మీరు నవ్వుకుంటున్నా ఇది నిజమే.అసలు నవ్వడం ఏమిటి? మనలో చాలామంది కంగారులో ప్యాంటు జిప్ వేసుకోవడం మర్చిపోతూ వుంటారు.ఆ విషయం మనకి ఎదుటివారు చూసి నవ్వినప్పుడు గానీ, గుర్తు రాదు.అబ్బాయిలు( boys ) నవ్వితే పర్వాలేదు.అమ్మాయిలు నవ్వితేనే అసలు చిక్కు.చాలా సిగ్గుగా అనిపిస్తుంది.
అందులోనూ వరసైన అమ్మాయిలు చూశారంటే ఇక అంతే… ఏడిపించి ఏడిపించి చంపేస్తారు.
మరి ఇప్పుడు అర్ధం అయిందా… ఈ అలెర్ట్ ఎలా ఉపయోగపడుతుందో.అవును, ఇపుడు అలాంటి పరిస్థితులను అధిగమించేందుకు స్మార్ట్ ప్యాంట్లు అందుబాటులోకి వచ్చేసాయి.అత్యాధునిక సాంకేతిక దీనిలో వాడడం గమనార్హం.
ప్యాంట్ జిప్ ( Pants zip )ఊడిపోతే దాని గుండా ప్రవేశించే గాలి ద్వారా అది జిప్ సెన్స్ అయ్యి మీ ఫోన్ కి నోటిఫికేషన్ పంపించేస్తుంది మరి.ఈమధ్య కాలంలో వ్యక్తిగత వస్తువుల దగ్గర నుంచి వంటి గది సామగ్రి వరకూ అన్నీ స్మార్ట్ టెక్నాలజీని వినియోగించుకొని మనిషికి మంచి సౌలభ్యాన్ని అందిస్తున్నాయి.ఇదే క్రమంలో స్మార్ట్ దుస్తులు కూడా మార్కెట్లోకి వచ్చేశాయ్.
ఆరోగ్యాన్ని ట్రాక్ చేసే షూస్, వాచెస్, స్మార్ట్ జాకెట్లు ( Shoes, watches, smart jackets )వున్నట్టే ఇప్పుడు స్మార్ట్ ప్యాంట్ కూడా మీకు అందుబాటులోకి వచ్చింది మరి.ఇది మీరు జిప్ పెట్టుకున్నారో లేదో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.గై డ్యూపంట్ అనే వ్యక్తి ఈ స్మార్ట్ ప్యాంట్ సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పంచుకోగా చాలామంది నెటిజన్లు తమకి అలాంటి పాంట్స్ కావాలని అడుగుతున్నారు.
మీకు కూడా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు మరి.ఒక్కసారి ఇక్కడ వీడియో చూసి తరించండి.ప్రపంచం ఎంత ముందుకు పోతోందో చాలా స్పష్టంగా అర్ధం అవుతుంది.