వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( YS Sharmila ) కన్ఫ్యూజన్ లో పడ్డారా ? ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారా ? కాంగ్రెస్ విషయంలోనే ఆమెకు ఎందుకీ కన్ఫ్యూజన్.? ప్రస్తుతం ఈ ప్రశ్నలు తెలంగాణ పోలిటికల్( Telangana politics ) సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయ్యాయి.నిన్నమొన్నటి వరకు ఒంటరిగానే బరిలోకి దిగుతానని చెప్పుకొచ్చిన షర్మిల ప్రస్తుతం తన నిర్ణయాన్ని మార్చుకునేందుకు సిద్దమైనట్లు పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం తెలంగాణలో బిఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ప్రభావం గట్టిగా ఉంది.
ఈ పార్టీలను దాటుకొని ఓటర్లను తనవైపు తిప్పుకోవడం షర్మిల కు పెద్ద సవాలే.అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై( YS Rajashekar reddy ) అభిమానం చూపించే వారంతా షర్మిలకు అండగా నిలిచే అవకాశం ఉన్నప్పటికి వారిలో కూడా కొంత కాంగ్రెస్ సానుభూతిపరులు ఉండడంతో షర్మిల వచ్చే ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోవచ్చనే వాదన వినిపిస్తోంది.దాంతో ఈ పరిణామాలను గమనించిన షర్మిల కాంగ్రెస్ తో దోస్తీ చేసేందుకు సిద్దమయ్యారా అనే అవుననే వాదన కూడా వినిపిస్తోంది.కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తరువాత ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్( DK Shivakumar ) తో వైఎస్ షర్మిల సమావేశం అయ్యారు.
అయితే వైఎస్ కుటుంబానికి డీకే శివకుమార్ తో ఉన్న అనుబంధం కారణంగానే ఆమె బేటీ అయ్యారనే స్పష్టం చేసినప్పటికీ, మళ్ళీ తాజాగా ఆమె రెండవ సారి కూడా డీకే శివకుమార్ తో బేటీ అయ్యారు.దీంతో ఈ బేటీ వెనుక రాజకీయ పరిణామాలు ఉన్నాయనేది కొందరి అభిప్రాయం.
త్వరలోనే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నారని, లేదా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించబోతున్నారని ఇలా రకరకాల వార్తలు వినిపించాయి.అయితే ఈ వార్తలను షర్మిల ఖండించినప్పటికి గుసగుసలు మాత్రం ఆగడం లేదు.అయితే నిజంగానే ఆమె కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించే ఆలోచనలో ఉంటే ఎందుకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో దూరంగా ఉంటున్నారనే ప్రశ్న కూడా తెరపైకి వస్తోంది.అయితే ఒకవేళ కాంగ్రెస్ కు షర్మిలా మద్దతు పలికితే.
హస్తం పార్టీకే ఎక్కువ లాభం చేకూరుతుంది తప్పా ఆమె సొంత పార్టీకి ఎలాంటి ఉపయోగం ఉండదనే కూడా చెప్పాలి.దాంతో ఈ కారణాల చేత ఆమె ఎటు చేల్చుకోలేని కన్ఫ్యూజన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.