జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు నేడు భీమిలి జనసేన శ్రేణులతో వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
వైసీపీకి రోజులు దగ్గర పడ్డాయని పేర్కొన్నారు.వైసీపీ ప్రభుత్వం విభజించు పాలించు అనే వ్యూహాన్ని అమలు చేస్తుంది.
ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టి.విధ్వంస పాలన అందిస్తూ రాజకీయ మైలేజ్ సంపాదిస్తుందని మండిపడ్డారు.
ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలంతా పవన్ కళ్యాణ్ సుపరిపాలన కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు.
రాష్ట్రంలో జనసేన పార్టీ బలోపేతం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని నాగబాబు పిలుపునిచ్చారు.దీంతో నాగబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.అనంతరం ఉమ్మడి కడప జిల్లా రైల్వే కోడూరు గంగమ్మ జాతరకు ఆహ్వానం అందింది.
కొన్ని కారణాలవల్ల ఈ జాతరకు వెళ్లకపోవడం పట్ల ట్వీట్టర్ వేదికగా మధ్యాహ్నం క్షమాపణలు తెలియజేశారు.అత్యవసర సమావేశాల వల్ల రాలేకపోతున్నట్లు త్వరలోనే అందరిని కలుస్తాను అని వివరణ ఇచ్చారు.
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నాగబాబు వరుసపెట్టి సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు.ప్రతి సమావేశంలో కూడా నాయకులు కార్యకర్తలతో కలిసి ఉండాలని పోరాడాలని పిలుపునిస్తూ ఉన్నారు.