బింబిసారని పూర్తిగా పక్కకి పెట్టినట్లేనా?

నందమూరి కళ్యాణ్ రామ్ హీరో గా బింబిసారా( Bimbisara ) అనే చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు వశిష్ఠ్‌( Vashisht ) ప్రస్తుతం మెగా హీరో తో సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.రామ్ చరణ్ తో సినిమా చేయాలని ఆశ పడ్డ ఈ యువ దర్శకుడి కి ఏకంగా మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేసే అవకాశం దక్కింది అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

 Director Vashisht Not Interested Bimbisara Part 2 , Bimbisara, Director Vashish-TeluguStop.com

ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.అంతకు ముందు సూపర్ స్టార్ రజనీకాంత్( Rajinikanth ) తో ఈ యువ దర్శకుడి సినిమా ఉండబోతుందనే పుకార్లు కూడా షికార్లు చేశాయి.

మొత్తానికి బింబిసారా తర్వాత ఈయన వరుసగా సినిమాలు చేసే అవకాశాలను దక్కించుకుంటున్నాడు.ఈ సమయం లోనే బింబిసారా సీక్వెల్ గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతుంది.

గతంలో బింబిసారా సీక్వెల్ ఉంటుందని స్వయంగా నందమూరి కళ్యాణ్ రామ్ ( Nandamuri Kalyan Ram )ప్రకటించిన విషయం తెలిసిందే.ఆ సినిమా కోసం దర్శకుడు వశిష్ట్‌ వర్క్ చేస్తున్నాడా అంటే అనుమానమే అన్నట్లుగా టాక్‌ వినిపిస్తుంది.చాలా సంవత్సరాల తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ కి బింబిసారా సినిమా తో సక్సెస్ తెచ్చిపెట్టిన దర్శకుడు ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ విషయాన్ని పట్టించుకోక పోవడం పట్ల నందమూరి అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ్‌ దర్శకత్వం లో సినిమా కన్ఫమ్ అయ్యి ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటే నందమూరి కళ్యాణ్ రామ్ తో భవిష్యత్తులో బింబిసార సీక్వెల్ కాదు కదా మరే సినిమా చేసే అవకాశాలు లేవు అంటూ ప్రచారం జరుగుతుంది.

ఒకవేళ చిరంజీవి తో సినిమా నే సక్సెస్ చేసుకుంటే ఖచ్చితంగా రజనీకాంత్ హీరో గా కూడా ఒక సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ సమాచారం అందుతుంది.అతి త్వరలోనే అన్ని విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube