సాధారణంగా చాలామంది వైద్యులు మనిషికి ఎనిమిది గంటలు నిద్ర( Eight hours of sleep ) చాలా ఉపయోగకరమని సూచిస్తూ ఉంటారు.లేదా కనీసం 6:30 గంటలపాటు అయినా మనిషికి నిద్ర సరిపోతుంది.ఇంతకన్నా ఎక్కువగా నిద్ర పోయినా తక్కువగా నిద్ర పోయినా కూడా చాలా ప్రమాదకరం.అందుకే 8 కంటే 9 గంటలపాటు నిద్రపోవడం వల్ల కూడా చాలా ప్రమాదకరం అయిన సమస్యలు వస్తాయి.
అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి మనిషి సాధారణ నిద్ర కంటే ఎక్కువగా నిద్రపోతే ఆ కండిషన్ ని హైపర్ సొమ్నియ( Hypersomnia ) అని అంటారు.
ఇక మరికొందరు వీకెండ్ లో, వెకేషన్లలో అవకాశం దొరికింది అన్న ఆలోచనతో సాధారణ సమయం కంటే ఎక్కువగా నిద్ర పోతారు.దీని వల్ల తలనొప్పి( headache ) వస్తుంది.
దీంతో ఎల్లప్పుడూ తలనొప్పితో బాధపడాల్సి వస్తుంది.ఇక మరి ముఖ్యంగా అతిగా నిద్రపోతే అధిక బరువు( overweight ) కూడా పెరుగుతుంది.
దీనివల్ల ఒబేసిటీ కీ కారణమవుతుంది.
అంతేకాకుండా చాలామంది ఎంత నిద్ర పోయినా కూడా ఇంకా నిద్ర కావాలన్నా ఆశతో నిద్ర రాకపోయినా అలాగే పడుకోడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.అలా సాధారణ నిద్ర కంటే ఎక్కువసేపు బెడ్ పైనే పడుకొని ఉండడం వలన బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.అంతేకాకుండా సాధారణ నిద్ర కంటే ఎక్కువగా నిద్రపోతే డిప్రెషన్ కు కారణం అవుతుంది.
ఈ విషయం కొన్ని అధ్యాయనాలు చెబుతున్నాయి.ఇక సాధారణ నిద్ర కంటే ఎక్కువ సేపు నిద్రపోయే వారికి గుండె సంబంధిత సమస్యలు కూడా వస్తాయి.అందుకే వైద్యనిపుణులు గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉండేందుకు ఎన్ని గంటలు నిద్రపోవాలో సూచిస్తూ ఉంటారు.సాధారణ నిద్ర కంటే ఎక్కువ సమయం నిద్రించే వారికి అలాగే సాధారణంగా ఎనిమిది గంటలు నిద్రించే వారితో పోలిస్తే మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని కొన్ని అధ్యాయాలు తెలిపాయి.