తాడేపల్లిలో ఇవాళ వైసీపీ కీలక సమావేశం జరగనుంది.సీఎం జగన్ అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై వర్క్ షాప్ నిర్వహించనున్నారు.
ఈ వర్క్ షాప్ కు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ ముఖ్య నేతలు హాజరుకానున్నారు.ఇందులో భాగంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై సీఎం జగన్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.
కాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తరువాత తొలి సమావేశం ఇదే.ఈ క్రమంలో జగన్ నిర్ణయాలపై పార్టీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.అయితే పని తీరు మార్చుకోని మంత్రులను సైతం మారుస్తానని సీఎం జగన్ ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే.నివేదిక ఆధారంగా జగన్ కీలక ప్రకటన చేస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి.