నటి దీపికా పదుకొనె మెడ పై ఉన్న ఈ టాటూ అర్థం ఏంటో తెలుసా?

బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి దీపికా పదుకొనే (Deepika Padukone)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా ఓ వెలుగు వెలుగుతున్నటువంటి ఈమె తాజాగా ఆస్కార్ (Oscar) వేడుకలలో భాగంగా ఈమె ఆస్కార్ ప్రజెంటేటర్ గా సందడి చేసిన విషయం మనకు తెలిసిందే.

 Do You Know The Meaning Of This Tattoo On Actress Deepika Padukones Neck Details-TeluguStop.com

ఇలా ఆస్కార్ వేదికపై స్టైలిష్ లుక్ లో సందడి చేసిన దీపిక చిరునవ్వులు చిందిస్తూ.స్టేజ్ మీదకు వచ్చి.

ఆర్ఆర్ఆర్(RRR) లోని నాటు నాటు సాంగ్ (Naatu Naatu Song) ki పెర్ఫామెన్స్ కు సబంధించిన అనౌన్స్ మెంట్ ను చేశారు.

Telugu Degrees, Skin Care, Deepikapadukone, Naatu Naatu, Oscar Presenter, Prabha

ఇలా ఈమె అనౌన్స్ చేయగానే హాలీవుడ్ సెలబ్రిటీల నుంచి ఎంతో మంచి రెస్పాన్స్ వచ్చింది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.ఇక ఆస్కార్ వేదికపై దీపిక చాలా స్టైలిష్ లుక్ లో సందడి చేశారు.

ఇలా ఆస్కార్ వేదికపై అందరి దృష్టిని ఆకర్షించిన ఈమె తన మెడ పై ఉన్నటువంటి టాటూ (Taatoo) కూడా అందరి దృష్టిలో పడింది.దీపిక తన మెడపై 82°E అనే టాటూను వేయించుకుంది.

అయితే అసలు 82°E కి అర్ధం ఏంటి.? అసలు అది మెడపై దీపికా ఎందుకు వేయించుకుంది అంటున్నటిజన్స్ పెద్ద ఎత్తున ఈ టాటూకి గల అర్థం ఏంటో వెతికే పనిలో పడ్డారు.

Telugu Degrees, Skin Care, Deepikapadukone, Naatu Naatu, Oscar Presenter, Prabha

దీపిక మెడ పై ఉన్నటువంటి ఈ టాటూ ’82 డిగ్రీస్ ఈస్ట్’ అని అర్థం అనిచాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.82°E అనేది ఆమె కొత్తగా మొదలుపెట్టిన స్కిన్ కేర్(Skin Care ) బ్రాండ్ పేరు అని తెలుస్తుంది.ఇక ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు పెద్ద ఎత్తున బిజినెస్ రంగంలో అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోని దీపికా పదుకొనే కూడా స్కిన్ కేర్ బ్రాండ్ పేరిట స్కిన్ కేర్ ప్రోడక్ట్ లను మార్కెట్లోకి తీసుకువస్తున్నారు.

ఇలా తన బిజినెస్ కు సూచికగా ఈమె మెడపై 82°E టాటూ వేయించుకున్నారని తెలుస్తుంది.దీపిక సినిమాల విషయానికొస్తే తాజాగా షారుఖ్ ఖాన్ తో కలిసి పఠాన్ సినిమాతో మంచి హిట్ అందుకున్నారు.

అలాగే ప్రభాస్ (Prabhas) హీరోగా ప్రాజెక్టు కే సినిమాలో కూడా ఈమె నటించబోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube