బిజెపితో ( BJP ) కలిసి ప్రయాణించే విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) క్లారిటీ ఇచ్చేశారు.బిజెపి కోసం తాను ఎన్నో విషయాల్లో రాజీ పడినా.
ఆ పార్టీ మాత్రం జగన్ కు మద్దతుగా నిలబడుతోందని, ఏదో ఒక సమయంలో బిజెపితో పొత్తు రద్దు చేసుకుంటామనే విషయాన్ని పరోక్షంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొన్న జరిగిన మచిలీపట్నం జనసేన పదవ ఆవిర్భావ సభలో చెప్పేసారు.అంతేకాదు టిడిపితో కలిసి వెళ్లబోతున్నామనే సంకేతాలను ఇచ్చారు.
తెలుగుదేశం పార్టీ పై ప్రత్యేక ఇష్టాలు ఏమీ లేవు అని చెబుతూనే.చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) అంటే గౌరవంతో మాట్లాడారు.
పవన్ ప్రసంగం సారాంశాన్ని బట్టి చూస్తే.రాబోయే ఎన్నికల్లో వైసీపీని ఓడించేందుకు టిడిపితో కలిసి వెళ్ళబోతున్నామనే విషయాన్ని పవన్ స్పష్టం చేశారనే విషయం అర్థం అవుతోంది.
అయితే ఈ వ్యవహారంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు.
రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీతో కలిసే తాము రాజకీయ ప్రయాణం సాగిస్తామని, ఇందులో ఎటువంటి మార్పు ఉండదని సోము వీర్రాజు( Somu Veeraju ) స్పష్టం చేశారు.జనసేన పదో ఆవిర్భావ సభలో టిడిపి తో పొత్తు ఉంటుందనే విషయాన్ని పవన్ ఎక్కడా ప్రస్తావించలేదని , బిజెపితో కలిసి ముందుకు వెళ్తామనే విషయాన్ని పవన్ చెప్పారని వీర్రాజు సమర్ధించుకుంటున్నారు.బిజెపితో కలిసి ముందుకు వెళ్లే విషయం జనసేన నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉన్నా.
బిజెపి మాత్రం జనసేన తో కలిపి ఎన్నికల్లో పోటీ చేస్తామని చెబుతోంది.కానీ జనసేన ఈ విషయంలో అంత సానుకూలంగా లేదు.బిజెపితో జనసేన కలిసి ఎన్నికలకు వెళ్ళినా.ఆ ప్రభావం అంతంత మాత్రమే అన్నట్టుగా ఉంటుందనే విషయాన్ని పరోక్షంగానే చెబుతున్నారు.
ఈసారి బలిపశువును కాను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దీనిలో భాగంగానే అనే విషయం అర్థం అవుతోంది.అంతే కాకుండా జనసేన బీజేపీ అధికారికంగా పొత్తు పెట్టుకున్నా.ఏ విషయంలోనూ కలిసి ముందుకు వెళ్లడం లేదు.ఎవరికి వారు విడివిడిగానే కార్యక్రమాలు చేసుకుంటున్నారు తప్ప, ఉమ్మడిగా ఏపీ ప్రభుత్వ విధానాలపై పోరాటాలు చేపట్టడం లేదు.బిజెపితో పొత్తు కొనసాగించే విషయంలో జనసేన వైపు నుంచి అంత సానుకూల పవనాలు రాకపోయినా, ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న వీర్రాజు మాత్రం జనసేన పైనే ఇంకా ఆశలు పెట్టుకున్నట్టుగా వ్యవహరిస్తున్నారు.