సాధారణంగా మనం నిద్ర లేవగానే చేసే పని ఏమిటంటే మనకు బాగా నచ్చిన వాళ్ళ ముఖం చూస్తూ ఉంటాం.లేదా మరి కొంత మంది తమ చేతులను చూసుకొని ప్రార్ధించుకోవడం వంటివి చేస్తూ ఉంటారు.
అయితే నిద్రలేచిన వెంటనే వాస్తు శాస్త్రం ప్రకారం వీటిని చూస్తే మంచి జరుగుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు.అలాగే వాస్తు ప్రకారం నడుచుకున్నట్లయితే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరమై పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుందని చెబుతున్నారు.
వాస్తు శాస్త్రం ప్రకారం ఎటువంటి వాటిని మనం నిద్ర లేచిన వెంటనే చూడాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.చాలా మందికి దేవుడి ఫోటోలను, బాగా నచ్చిన వారి ఫోటోలను చూసుకోవడం అలవాటుగా ఉంటుంది.
ఇది కూడా వాస్తు శాస్త్రం ప్రకారం మంచిదని చెబుతున్నారు.అందువల్ల మనలో ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
తెల్లవారు జామున సుమంగళిని చూడడం లేదా ఆమె చేతిలోనే పూజ పెళ్ళాన్ని చూస్తే అది కూడా మంచిదని చెబుతున్నారు.
వాస్తు శాస్త్రం ప్రకారం ఉదయం లేచిన వెంటనే అద్దంలో చూసుకుంటే చాలా మంచిదని చెబుతున్నారు.దీనివల్ల నెగటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుందని చెబుతున్నారు.కానీ మీరు అద్దములు చూసే ముందు ఒకసారి మీరు ఫ్రెష్ అప్ అయిన తర్వాత అద్దంలో చూసుకోవడం ముఖ్యమని చెబుతున్నారు.
ముఖ్యంగా చెప్పాలంటే ఉదయం పూట పాలు, పెరుగు మొదలైనవి కనిపించడం కూడా శుభప్రదమే అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.ఉదయం కళ్ళు తెరిచిన వెంటనే పక్షుల కిలకిలరావాలు వినిపిస్తే ఆరోజు శుభప్రదంగా మొదలవుతుందని అర్థం చేసుకోవచ్చు.
ముఖ్యంగా చెప్పాలంటే రాత్రి తిన్న తర్వాత శుభ్రపరచని వస్తువులను ఉదయం పూట అసలు చూడకూడదు.అవి నెగిటివ్ ఎనర్జీని ఇంట్లోకి వచ్చేలా చేస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
అందుకే రాత్రి తిన్న సామాన్లను శుభ్రం చేసుకోవాలి లేకపోతే నెగటివ్ ఎనర్జీ కలిగి పాజిటివ్ ఎనర్జీ దూరమైపోతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
DEVOTIONAL