సీనియర్ నరేష్ పవిత్ర లోకేశ్ పెళ్లి గురించి తరచూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి.అయితే నరేష్ పవిత్ర పెళ్లి బంధంతో ఒక్కటయ్యారని అగ్నిసాక్షిగా ఏడడుగులు వేశారని సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇప్పటికే నరేష్ మూడు పెళిళ్లు చేసుకోగా రమ్య రఘుపతి నరేష్ విడాకుల అంశం ప్రస్తుతం కోర్టులో ఉందనే సంగతి తెలిసిందే.ఈ కోర్టు కేసు తేలే వరకు నరేష్ మళ్లీ పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు.
నరేష్ పవిత్ర పెళ్లి చేసుకున్నట్టు ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతుండగా ఈ ఫోటోలు, వీడియోల వెనుక అసలు కథ వేరే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.నరేష్ పవిత్ర నిజంగా పెళ్లి చేసుకోలేదని మూవీ ప్రమోషన్స్ లో భాగంగా పెళ్లి చేసుకున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఈ పెళ్లి గురించి పూర్తిస్థాయిలో స్పష్టత రావాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

సినిమాల షూటింగ్ లలో పాల్గొంటున్న సమయంలోనే నరేష్ పవిత్రల మధ్య ప్రేమ పుట్టింది.పవిత్ర లోకేశ్ కూడా ఇప్పటికే తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చారు.నరేష్ పవిత్రల పెళ్లి అంటూ జరుగుతున్న ప్రచారం విషయంలో రమ్య రఘుపతి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
నరేష్ పవిత్రల వ్యవహారంలో రాబోయే రోజుల్లో మరిన్ని ట్విస్టులు చోటు చేసుకునే అవకాశం ఉంది.

సీనియర్ నరేష్ మాత్రం నిజంగానే పవిత్రతో పెళ్లి జరిగినట్టు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.నరేష్ పవిత్ర పెళ్లి చేసుకున్నట్టు ప్రకటించడంతో సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.నరేష్ పవిత్ర ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.
సీనియర్ నరేష్, పవిత్ర రెమ్యునరేషన్ సైతం భారీ రేంజ్ లో ఉన్నట్టు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.







