ఈ మధ్య కాలంలో సినిమా హీరోయిన్లు హద్దులు దాటి ఏం చేసినా అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.కొంతమంది నటీనటులు తమ స్థాయిని దాటి ప్రవర్తిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
టాలీవుడ్ ఇండస్ట్రీతో పోలిస్తే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ తరహా ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.
ప్రముఖ బాలీవుడ్ నటీమణులలో ఒకరైన కశ్మీరా షా మద్యం మత్తులో తన భర్తకు లిప్ లాక్ ఇచ్చారు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.కశ్మీరా షా భర్తతో కలిసి పార్టీకి వెళ్లి ఎక్కువ మొత్తంలో మద్యం తీసుకున్నారు.మత్తులో వేర్వేరు భంగిమలలో ఫోజులు ఇస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు.భర్త అక్కడినుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా ఆమె భర్తకు ముద్దులు ఇచ్చారు.
భర్త వద్దని ఎంత చెబుతున్నా ఆమె మాత్రం భర్త మాటలను అస్సలు పట్టించుకోలేదు.ప్రస్తుతం కశ్మీరా షా సినిమాలకు దూరంగా ఉంటున్నారు.ఈ స్టార్ హీరోయిన్ ప్రవర్తన గురించి కొంతమంది పాజిటివ్ గా కామెంట్లు చేస్తుండగా ఎక్కువమంది నెగిటివ్ గా కామెంట్లు చేస్తున్నారు.ఎస్ బాస్ అనే సినిమాతో నటిగా ఈ నటి ప్రయాణం మొదలైంది.
తొలి సినిమాతోనే ఈ నటి మంచి మార్కులు సొంతం చేసుకుంది.
ఆ తర్వాత పలు క్రేజీ ప్రాజెక్ట్ లలో నటించిన ఈ నటి సినిమా సినిమాకు తన స్థాయిని పెంచుకుంటున్నారు.2013 సంవత్సరంలో నటుడు కృష్ణ అభిషేక్ తో ఈ నటి వివాహం జరిగింది.పెళ్లి తర్వాత ఈ జోడీ అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నారు.
ఈ జంటకు ఇద్దరు పిల్లలు కాగా ఆ పిల్లలు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది.వైరల్ అవుతున్న వీడియో గురించి, ట్రోల్స్ గురించి ఈ నటి ఏమని స్పందిస్తారో చూడాల్సి ఉంది.