పుట్టిన ఊరి కోసం రూ.1.10 ఖర్చు పెట్టిన ఎన్నారై.. ఆ వివరాలివే!

ఒక ఊరిలో పుట్టి పెరిగిన తరువాత దాని కోసం ఏదో ఒకటి చేయాలని అందరికీ ఉంటుంది.బాగా కష్టపడి బాగా సంపాదించిన వారు మాత్రమే తమ సొంతూరికి ఏదో ఒక మంచి పని చేయగలరు.

 Nri Who Spent Rs. 1.10 For The Place Of Birth Those Are The Details , Village,-TeluguStop.com

అయితే మాములుగా లక్షల్లో మాత్రమే డబ్బులు పెట్టగలరు.కానీ ఒక ఎన్నారై మాత్రం ఏకంగా రూ.1.10 కోట్లు సొంత గ్రామం కోసం ఖర్చు చేశాడు.ఫారిన్ కంట్రీలలో పని చేసి సంపాదించిన డబ్బులో అతను ఇలా కొంత మొత్తాన్ని సొంతూరి కోసం ఉపయోగించాడు.

వివరాలు తెలుసుకుంటే.

రాజస్థాన్ రాష్ట్రం, బార్మర్ జిల్లా‌, బుద్ధ తలా గ్రామంలో నవల్ కిశోర్ గోదారా పుట్టి పెరిగాడు.తరువాత ఆఫ్రికాలోని కాంగోలో బిజినెస్ మొదలు పెట్టి అక్కడే స్థిరపడ్డాడు.

బిజినెస్‌లో బాగా డబ్బులు సంపాదించిన అతను తన సొంత ఊరిని బాగు చేయాలనుకున్నాడు.అందుకు రూ.1.10 కోట్లు ఖర్చు పెట్టాడు.ఇతను తన ఊరి గ్రామ పంచాయితీ భవనాన్ని బ్రహ్మాండంగా కట్టించాడు.ఇది కార్పొరేట్ ఆఫీస్‌ను తలపిస్తుంటే అందరూ అవాక్కవుతున్నారు.ఈ భవనంలో ఫెసిలిటీలు కూడా చాలా అడ్వాన్స్‌డ్‌ లెవెల్‌లో ఉండటం విశేషం.

Telugu Latest, Noji Devi, Nri, Rajasthan-Telugu NRI

ఈ భవనంలో పని చేసే ముగ్గురికి నెలనెలా తన సొంత మనీతో శాలరీలు ఇస్తున్నాడు.ఆ ముగ్గురు ఉద్యోగులు ఊరి ప్రజల సమస్యలను పరిష్కరిస్తారు.అలానే సమస్యలను కిశోర్ దృష్టికి తీసుకెళ్తారు.

ఇక గ్రామ పంచాయితీ భవనం కోసం కొన్న కారు ఊరి ప్రజలు ఎమర్జెన్సీ టైమ్‌లో ఉపయోగించడానికి హెల్ప్ అవుతుంది.మరో విశేషమేంటంటే ఈ ఊరికి సర్పంచ్ స్వయానా కిశోర్ తల్లి నోజి దేవీ.

ఆమె వయసు 80 ఏళ్లు.ఆ వయసులో ఆమె అన్నీ చూసుకోలేదు కాబట్టి కొడుకే ఊరి బాధ్యతలను భుజాలకు ఎత్తుకున్నాడు.

Telugu Latest, Noji Devi, Nri, Rajasthan-Telugu NRI

కిషోర్ ఇప్పుడు తన గ్రామంలోని రోడ్లు, తాగునీరుతో సహా అన్ని సౌకర్యాలను ఆఫర్ చేస్తున్నాడు.దాంతో గ్రామస్థులు అతనిని తెగ ప్రశంసిస్తున్నారు.ఇలా సొంత ఊరి కోసం ఈ స్థాయిలో డబ్బులు ఖర్చు పెట్టేవారు చాలా తక్కువ అని కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube