అమరావతి: మాజీ మంత్రి పేర్ని నాని కామెంట్స్.సీఎం జగన్ పై విషపు రాతలు రాసి జగనాసుర అనే పేరు పెట్టారు.
టీడీపీ ఎదో జాతీయ పార్టీ అయినట్టు.ఏపీకి ఓ అధ్యక్షుడు.
ఏపీ టీడీపీ అధ్యక్షుడుకు బాడీ తప్ప బ్రెయిన్ లేదు.అసలు జగనాసుర అనే పుస్తకంలో ఎక్కడా టీడీపీ పేరు కానీ చంద్రబాబు పెరు కానీ లేవు.
ఎందుకు ఇంత భయం…నిజాయితీ ఉంటే పేరు వెయ్యాలిగా.అసత్యాలు.
విషపు రాతలు కాబట్టి పేరు లేదు… వివేకా హత్య జరిగిన సమయంలో టీడీపీ ప్రభుత్వం ఉంది.చంద్రబాబు సీఎం కదా.మరి అప్పుడు ఎందుకు విచారించలేదు.అసలు వివేకా కేస్ లో అప్పటి ప్రభుత్వం ఎందుకు చార్జీషీట్ వెయ్యలేదు.
ఎందుకు అవినాష్ పేరు చేర్చలేదు.
ఎన్టీఆర్ చనిపోయినప్పడు కనీసం సీబీసీఐడి విచారణకు కూడా బాబు ఎందుకు ఇవ్వలేదు.వివేకా హత్య జరిగిన సమయంలో అప్పటి ప్రభుత్వంలో ఎందుకు కదలిక లేదు.టీడీపీ ప్రభుత్వం విచారణ ఎందుకు చెయ్యలేదు.
కోడెల మరణంపై పుస్తకం ఎందుకు వెయ్యలేదు.కోడెల ఫోన్ ఎక్కడుంది.
కోడెల ఫోన్లో చంద్రబాబు గురించి ఉందా.చంద్రబాబు అవమానాలు భరించలేక మరణిస్తున్నా అని కోడెల చెప్పాడా.
ఎందుకు కోడెల ఫోన్ ధ్వంసం అయిందో ఓ పుస్తకం వెయ్యండి.ఎన్టీఆర్ కుమార్తె మరణంపై కూడా పుస్తకం వేసి సిబిఐకి విచారణ కోరాలి.
ఎన్టీఆర్ పైనే కుట్ర పన్ని నాశనం చేశారు.ఎన్టీఆర్ కు ఎందుకు ఆ స్థితి వచ్చింది అనే దానిపై కూడా విచారణ చెయ్యాలి.