నాడు శిథిలావస్థకు చేరిన పాఠ‌శాలు.. ఆ ప్ర‌ధానోపాధ్యాయురాలి రాక‌తో న‌మ్మ‌లేనంత‌లా మారిపోవ‌డంతో...

శిథిలావస్థలో ఉన్న పాఠశాల ముఖ‌చిత్రాన్ని ఓ ఉపాధ్యాయురాలు పూర్తిగా మార్చేసింది.ఒకప్పుడు ఈ పాఠశాలలో 200 మందిలోపు విద్యార్థులు చదువుకునేవారు.

 Government Middle School Best School Award , School Award, Nehrunagar, Delhi, S-TeluguStop.com

కానీ ప్రస్తుతం ఈ పాఠశాల పరిస్థితి ఏంటంటే… తమ పిల్లల అడ్మిషన్లకు త‌ల్లిదండ్రులు క్యూలు కడుతున్నారు.ఢిల్లీలోని నెహ్రూనగర్‌లోని ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల గురించి, ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎస్ సీతాలక్ష్మి సాధంచిన ఘ‌న‌త గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఈ పాఠశాల 2016-17 సంవత్సరంలో ప్రతిష్టాత్మకమైన ఉత్తమ పాఠశాల అవార్డును కూడా గెలుచుకుంది.2009లో 194 మంది విద్యార్థులు మాత్రమే.సీతాలక్ష్మి ఈ పాఠశాలకు వచ్చినప్పుడు ఇక్కడి పరిస్థితి చాలా దారుణంగా ఉండేదని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.ఈ పాఠశాలలో 2009లో 194 మంది విద్యార్థులు మాత్రమే చదువుతుండగా, ప్రస్తుతం 650 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు.

గతంలో పాఠశాలకు సరిహద్దు గోడ కూడా లేదు.మరుగుదొడ్డి, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు తాగునీరు అందుబాటులో లేదు.ఈ పాఠశాలలో ఒక్క‌ చెట్టు కూడా లేదు.గతంలో ఈ పాఠశాల ఆవరణలో అపరిచిత వ్యక్తులు నిద్రించడంతో పాటు మద్యం ప్రియుల ఆవాసంగా మారింది.

వీటన్నింటిని సరిదిద్దడానికి ఆమె చాలా కష్టపడాల్సి వచ్చింది.

Telugu Delhi, Middleschool, Ias Academy, Nehrunagar, School Award, Sita Lakshmi-

సొంత ఖర్చుతో ప‌నులు ఈమె పాఠశాలకు వ‌చ్చిన‌ ప్రారంభ రోజుల్లో పాఠశాలను శుభ్రం చేయడానికి తన స్వంత ఖర్చుతో ఒక వ్యక్తిని నియమించుకున్నారు.డిపార్ట్‌మెంట్ ద్వారా ఒక ఉద్యోగిని నియమించేందుకు ప్ర‌య‌త్నించారు.ప్ర‌స్తుతం పాఠశాల ఆవ‌ర‌ణ‌లో మొక్క‌ల నాటారు.

సీతాలక్ష్మి పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులను కలుసుకుని, అవసరమైతే పిల్లల భవిష్యత్తుకు సంబంధించి సలహాలు ఇస్తుంటారు.పాఠశాలలో జూనియర్ ఐఎఎస్‌ అకాడమీ ప్రారంభమైంది సీతాలక్ష్మి ఈ పాఠశాలలో జూనియర్ ఐఎఎస్‌ అకాడమీని ప్రారంభించారు.

ఇది విద్యార్థులకు సివిల్ సర్వీసెస్ పరీక్షకు స్కాలర్‌షిప్‌లను అందుకునేందుకు సహాయపడుతుంది.విద్యార్థికి వార్షిక స్కాలర్‌షిప్ రూ.12,000 అందుతుంది.దీనితో పాటు ఈ పాఠశాలలోని పిల్లలను చెస్, రోబోటిక్ తరగతులు, ఆల్ ఇండియా రేడియో వంటి కార్యక్రమాలలో చేర్చారు.ఇది వారి వ్యక్తిగత నైపుణ్యాలను పెంపొందించడానికి చాలా సహాయపడుతుంది.సీతాలక్ష్మి ఉదయం 8 గంటలక‌ల్లా పాఠశాలకు చేరుకుని, సాయంత్రం 7 గంటల తర్వాతే అక్కడి నుంచి తన ఇంటికి వెళుతుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube