జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు.. సీఎం కేసీఆర్ ప్రకటన

బీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఖమ్మంలోని జర్నలిస్టులతో పాటు గ్రామ పంచాయతీలకు వరాలు ప్రకటించారు.ఖమ్మం హెడ్‌ క్వార్టర్‌లో ఉన్న జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

 Homes For All Journalists.. Cm Kcr's Announcement-TeluguStop.com

ప్రభుత్వ స్థలం లేకపోతే ప్రభుత్వామే భూమిని సేకరిస్తుందని, జర్నలిస్టులు అందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తుందని తెలిపారు.ఫొటో జర్నలిస్టులు, కెమెరా జర్నలిస్టలందరికీ ఈ పథకం వర్తిస్తుందన్నారు.

ఈ ప్రక్రియ నెల రోజుల్లోనే పూర్తి చేస్తామన్నారు.ఈ మేరకు మంత్రి హరీశ్ రావుతో పాటుజిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు.

అదేవిధంగా జిల్లాలో ఉన్న ప్రతి గ్రామానికి ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.కాగా జిల్లాలో మొత్తం 589 గ్రామ పంచాయతీలు ఉన్న సంగతి తెలిసిందే.అదేవిధంగా పెద్దతాండ, కల్లూరు, ఏదులాపురం, తల్లాడ, నేలకొండపల్లి 10 వేల జనాభాకు మించి ఉండి.మేజర్‌ గ్రామ పంచాయతీలుగా ఉన్న గ్రామాలకు ఒక్కోదానికి రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.ఖమ్మం మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.అంతేకాకుండా మధిర, వైరా, సత్తుపల్లి కి రూ.30 కోట్లు చొప్పున మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube