ఖాందేవ్ జాతర ఎప్పటినుంచి మొదలై.. ఎన్ని రోజుల వరకు ఉంటుందంటే..

మన తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలో కొలువుదిరిన ఖాందేవ్ జాతరకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.వంశీయుల ఆధ్వర్యంలో ఈనెల 6వ తేదీన ఈ జాతర మొదలు అయ్యే అవకాశం ఉంది.

 When Does The Khandev Jatara Start? How Many Days Will It Last? Adilabad , Dis-TeluguStop.com

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసే పనిలో ఉన్నారు.జాతర నిర్వహించే ప్రాంతంతోపాటు దేవాలయ ప్రాంగణంలో పిచ్చి మొక్కలు, చెత్తాచెదారం తొలగిస్తున్నారు.

ప్రతి సంవత్సరం పుష్ప మాసంలో ఖాందేవ్ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.

ఈనెల 5వ తేదీన మార్కాపూర్ లో గోవర్ధన్ గుట్ట వద్ద ఆ వంశస్థులు కుటుంబ సమేతంగా బసవ చేస్తారు.

మైసా మాల దేవతకు సంప్రదాయ పూజలు చేస్తారు.అక్కడి నుంచి ఆరవ తేదీన ఖాందేవరానికి చేరుకుంటారు.

చేరుకొని అర్ధరాత్రి తొడసం వంశీయులు దేవతల ప్రతిమలకు పవిత్రమైన గంగాజలంతో అభిషేకం నిర్వహిస్తారు.సంస్కృతి, సంప్రదాయాల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి జాతర మొదలుపెడతారు.

Telugu Adilabad, Bhakti, Devotional, Govardhan Gutta, Jathara, Kamdev Temple, Ma

20 తేదీన ఉదయం ఏడు గంటల సమయంలో ఆ వంశం ఆడబిడ్డ పవిత్రమైన నువ్వుల తైలం తాగానున్నది.15 రోజులపాటు జాతర అత్యంత వైభవంగా ఘనంగా జరిగే అవకాశం ఉంది.జాతర సందర్భంగా క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ పోటీలు జరిగే అవకాశం ఉంది.తెలంగాణ రాష్ట్రం తో పాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉమ్మడి జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు తీర్చుకునే అవకాశం ఉంది.

తైలం తాగే మహోత్సవాన్ని తొలగించేందుకు ప్రముఖులు, అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు.అదే రోజు దేవాలయ ప్రాంగణంలో మినీ దర్బార్ ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు.

ప్రతి సంవత్సరం పుష్ప మాసం పౌర్ణమి రోజున సంప్రదాయం ప్రకారం పూజ నిర్వహించి జాతర మొదలు పెడతారు.మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వీరాధిగా తరలివస్తూ ఉంటారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులకు రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube