యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాలో హాలిడే ట్రిప్ లో ఉన్న విషయం తెలిసిందే.సోషల్ మీడియా ద్వారా వరుసగా ఎన్టీఆర్ తన అమెరికా ట్రిప్ కు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలను షేర్ చేస్తూ ఉన్నాడు.
కొరటాల శివ దర్శకత్వం లో చేయాల్సిన సినిమా స్క్రిప్ట్ ఇష్యూ కారణంగా ఆలస్యం అవుతూ వస్తోంది.వచ్చే ఏడాది వరకు షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
దాంతో ఎన్టీఆర్ రెస్ట్ తీసుకునే ఉద్దేశంతో అమెరికా వెళ్ళాడు అంటూ ప్రచారం జరుగుతుంది.ఆ విషయం పక్కన పెడితే ఎన్టీఆర్ ఎప్పుడు తిరిగి ఇండియా కు వస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది.
ఎన్టీఆర్ సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం కొత్త సంవత్సరం వేడుకలను అమెరికా లోనే ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యుల తో చేసుకోబోతున్నారట.
కొత్త సంవత్సరం వేడుకలు అక్కడ చేసుకుని సంక్రాంతికి మాత్రం ఎన్టీఆర్ ఇండియా కు తిరిగి వస్తాడని తెలుస్తుంది.ఆయన సన్నిహితు లతో పాటు మిత్రులు, కుటుంబ సభ్యులు అంతా కూడా అమెరికా లో ఉండడంతో ఇన్నాళ్లు అక్కడే ఉన్నాడని తెలుస్తోంది.అతి త్వరలోనే ఎన్టీఆర్ సినిమా యొక్క స్క్రిప్ట్ వరకు పూర్తి అవుతుంది.
మరో వైపు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ముగియబోతోన్నాయి.సంక్రాంతి తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా యొక్క షూటింగ్ ప్రారంభం కాబోతోంది అంటూ సమాచారం అందుతుంది.
ఎన్టీఆర్ ఆ తర్వాత కేజిఎఫ్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో ఒక భారీ యాక్షన్ సినిమా ను చేయబోతున్నాడు.ఆ సినిమా లో బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ నటించిన బోతున్నట్లుగా కూడా తెలుస్తోంది.
మొత్తానికి వరుసగా ఎన్టీఆర్ సినిమా లు వచ్చే ఏడాది చేయబోతున్నాడు.ఈ ఏడాది ఆర్‌ఆర్ఆర్ తో వచ్చిన ఎన్టీఆర్ వచ్చే ఏడాది కొరటాల శివ సినిమాతో వస్తాడా అనేది చూడాలి.