కాల గమనంలో 2022 సంవత్సరం కూడా కలిసి పోబోతుంది.ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వినోదాల విందు వచ్చింది.
చాలా మంది స్టార్ హీరోలు ఈ ఏడాది తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.బాలకృష్ణ మరియు అల్లు అర్జున్ నటించిన సినిమా లు ఈ సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రాలేదు.
కానీ మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య మరియు గాడ్ ఫాదర్ సినిమాలు బాక్సాఫీస్ వద్దకు వచ్చాయి.రెండు సినిమాల్లో ఒక సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వగా మరో సినిమా పరవాలేదు అనిపించుకుంది.
ఇక ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా అత్యంత దారుణమైన పరాజయం గా నిలిచింది.ఈ ఏడాది లో అట్టర్ ప్లాప్ సినిమా గా ఆ సినిమా ఉంటుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.
ఇక పవన్ కళ్యాణ్ నటించిన సినిమా లు కూడా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ ను సొంతం చేసుకున్నాయి.ఈ ఏడాది లో మరో దురదృష్టమందుడు ఎవరు అంటే విజయ్ దేవరకొండ.
ఈయన నటించిన లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరాజయాన్ని మూట కటుకుంది.అందుకే ఆ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ చేయాలనుకున్న సినిమా లు కూడా క్యాన్సిల్ అయ్యాయి.
ఇక నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమా కూడా ఫ్లాప్ అయింది.నితిన్ నటించిన సినిమా మాచర్ల నియోజక వర్గం చిత్రం బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది, మహేష్ బాబు నటించిన సర్కార్ వారి పాట పర్వాలేదు అనిపించుకుంది.ఇంకా ఈ ఏడాది నాగ చైతన్య కూడా తన థాంక్యూ సినిమా తో నిరాశ పరిచాడు.రామ్ తన ది వారియర్ సినిమా తో నిరాశ పర్చాడు.
మొత్తంగా ఈ ఏడాది తెలుగు హీరోలకు కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్నట్లుగా నిలిచింది అనడంలో సందేహం లేదు.వచ్చే ఏడాది అయినా అందరు హీరోలకు సక్సెస్ లు దక్కుతాయేమో చూడాలి.