యూకే : జాతి వివక్షపై పోరాటం.. న్యాయస్థానంలో భారతీయ లెక్చరర్‌కు ఊరట

యూకేలో జాతి వివక్షకు సంబంధించి ఓ భారతీయ లెక్చరర్ న్యాయస్థానంలో కేసును గెలిచింది.వివరాల్లోకి వెళితే.

 Indian Lecturer Wins Discrimination Case Against Uk University , Uk University ,-TeluguStop.com

పోర్ట్స్‌మౌత్ యూనివర్సిటీ డాక్టర్ కాజల్ శర్మను ఉద్యోగంలో పునర్నియమించలేదు.ఆమెకు బదులుగా ఎలాంటి అనుభవం లేని శ్వేత జాతీయుడిని నియమించినట్లు ది గార్డియన్ నివేదించింది.12 మంది శ్వేతజాతి సహోద్యోగులలో 11 మంది కాంట్రాక్ట్‌లు ముగియడంతో వారిని తిరిగి నియమించారు.అయితే 2016 నుంచి పనిచేస్తున్న కాజల్ శర్మకు మాత్రం ఉద్యోగం ఇవ్వలేదు.

దీనిపై ఆమె ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది.

సౌతాంప్టన్‌లో జరిగిన కేసు విచారణ సందర్భంగా.

మేనేజర్ డాక్టర్ గ్యారీ రీస్‌తో ఇబ్బందిగా వున్నట్లు కాజల్ శర్మ తెలిపారు.తన తండ్రి మరణించిన వెంటనే యూనివర్సిటీలో విధుల్లో చేరాలని రీస్ కోరినట్లు ఆమె చెప్పింది.

అలాగే తీవ్ర అనారోగ్యంతో వున్న తన బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటున్నప్పుడు ఆఫీసులో తగిన మద్ధతు లభించలేదని కాజల్ ఆవేదన వ్యక్తం చేశారు.దీనితో పాటు ఒక శ్వేతజాతి సహోద్యోగిని అదనంగా ఏదైనా నేర్చుకోవాలని రీస్ చెప్పాడని… కానీ కాజల్‌ తనంతట తాను అదే చేయాలనుకున్నప్పుడు ఆమెకు ఎలాంటి మద్దతు లభించలేదు.

ఇక.కాంట్రాక్ట్ ముగిసిన తర్వాత ఉద్యోగం కోసం కాజల్ మరోసారి దరఖాస్తు చేసుకున్నారు.ఈ సందర్భంగా రీస్‌తో కూడిన ఇంటర్వ్యూ ప్యానెల్ ముందు ఆమె హాజరయ్యారు.అయితే రీస్ మద్ధతు వున్న ప్రత్యర్ధి చేతిలో కాజల్ ఓడిపోయారు.

దీనిపై ట్రిబ్యూనల్ స్పందిస్తూ… ఆమెను ఉద్యోగంలో పునర్నియమించకపోవడం అసాధారణమని వ్యాఖ్యానించింది.కాజల్ శర్మ జాతి వివక్షకు గురయ్యారని ధర్మాసనం తీర్పు చెప్పింది.

Telugu Dr Kajal Sharma, Dr Gary Rees, Indianlecturer, Guardian, Trades Congress,

2022 టీయూసీ ( ది ట్రేడ్స్ యూనియన్ కాంగ్రెస్) సర్వే ప్రకారం.మైనారిటీ జాతి నేపథ్యాలకు చెందిన 1,20,000 కంటే ఎక్కువ మంది కార్మికులు జాతి వివక్ష కారణంగా తమ ఉద్యోగాలను విడిచిపెట్టారు.గడిచిన ఐదేళ్ల కాలంలో నల్లజాతి , ఇతర మైనారిటీ జాతి నేపథ్యాలకు చెందిన నలుగురిలో ఒకరి కంటే ఎక్కువ మంది కార్మికులు పని ప్రదేశాల్లో జాతి వివక్షను ఎదుర్కొన్నారని ఈ సర్వే వివరించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube