RBI Bharat Bill Payment System : సామాన్యుల కోసం ఆర్‌బీఐ సరికొత్త సర్వీస్.. ఇకపై ఆ చెల్లింపులు మరింత సులభం..

రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ వాడకం పెరిగిపోయిన నేపథ్యంలో తన సేవలను కూడా పెంచేందుకు సిద్ధమైంది.ఇందులో భాగంగా ఇప్పటికే భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ అందుబాటులోకి తెచ్చింది.

 Rbi Governor Bats For Expanding Scope Of Bharat Bill Payment System And Upi,rese-TeluguStop.com

మళ్లీ ఇప్పుడు సామాన్యులందరి అవసరాలకు అనుగుణంగా భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ లిమిట్‌ను పెంచేందుకు రెడీ అయ్యింది.దీనివల్ల సమీప భవిష్యత్తులో భారతదేశంలోని సామాన్యులందరూ తమ ఇంటి అద్దె, స్కూల్ ఫీజులు, ట్యాక్స్, ఇతర ఛార్జీలన్నీ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా పే చేయడం కుదురుతుంది.

ప్రస్తుతానికి భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ రికరింగ్ బిల్ పేమెంట్స్‌ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతోంది.కాగా మరికొద్ది రోజుల్లో ఈ పేమెంట్ సిస్టమ్‌ హౌజ్ రెంట్ నుంచి స్కూల్ ఫీజుల వరకు ప్రతిదీ చెల్లించుకోవడానికి ఉపయోగపడనుందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఓ పాలసీ రివ్యూ మీటింగ్‌లో చెప్పుకొచ్చారు.

రికరింగ్ బిల్లులతో పాటు నాన్ రికరింగ్ పేమెంట్లు జరిపేలా సరికొత్త సదుపాయాలు తీసుకొస్తే భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్‌ను అత్యధికులు వాడే ఛాన్స్ ఉంటుందని గవర్నర్ శక్తికాంత్ దాస్ చెప్పారు.

Telugu Bharat System, Bharatsystem, Rbi Policy, Tax-Latest News - Telugu

భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ 2017లో అందుబాటులోకి వచ్చింది.ఈ చెల్లింపు వ్యవస్థ ద్వారా ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా పేమెంట్లు జరపవచ్చు.ఆపై తక్షణమే కన్ఫర్మేషన్ అందుకోవచ్చు.

యూజర్లు క్రెడిట్, డెబిట్ లేదా ప్రీపెయిడ్ కార్డుల ద్వారానైనా పేమెంట్లు చేసుకునే వెసులుబాటును ఈ పేమెంట్ సిస్టమ్‌ అందజేస్తుంది.ఆర్‌బీఐ పెట్టిన నిబంధనల ప్రకారం ఈ వ్యవస్థ వర్క్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube