మన దేశంలోని చాలా దేవాలయాలలో దేవుడు ఉంటాడు కాబట్టి ప్రతి రోజు భక్తులు అక్కడికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు.అంతేకాకుండా కొబ్బరికాయలు కొట్టి పలు రకాల కోరికలను తీర్చమంటూ భగవంతుని వేడుకుంటూ ఉంటారు.
భగవంతుడు భోళా శంకరుడు కాబట్టి భక్తులు అడిగినా కోరికలన్నీ తీరుస్తూ ఉంటాడు.కానీ భగవంతునికి కావలసింది మనం చేస్తున్నామా అని ఎప్పుడూ ఆలోచన చేయరు.
దేవుడా మాకు కావాల్సింది చేస్తున్నావు నీకు కావాల్సింది ఏదైనా చెప్పు మేము కూడా చేస్తాం అని చెప్పేవారు ఎవరు ఉండరు.ఒకవేళ అడిగిన ఆయన భక్తుల మంచికి సంబంధించినవే అడుగుతాడు అని కూడా భక్తుల నమ్మకం.
భగవంతుడు భక్తులకు ఇద్దరినీ కలిపి చూడమని చెబుతాడు.
అదే నిజమైన దర్శనమని కూడా చెప్తాడు.
ఎలాగంటే మనలోనే భగవంతుడు ఉన్నాడని దాన్నే తెలుసుకునే ప్రయత్నం చేయాలని కూడా చెబుతాడు.ఎప్పుడైనా భక్తుడు దేవాలయానికి వెళితే దర్శనం మీదే దృష్టి ఉంచాలి.
పెద్దపెద్ద ఆలయాల్లో ఎక్కడ మనకు తీర్థం కూడా ఇవ్వరు.అలాంటి ఆలయాలలో ముఖ్యమైనది భగవంతుడి దర్శనం మాత్రమే.
జాతకాలు, సిద్ధాంతాలు లేని జీవనానికి సంబంధించినవే వాటిని ఎప్పుడు స్థూలంగా పాటించాలి కానీ సూక్ష్మంగా అస్సలు చూడకూడదు.భక్తులు వారికి ఇష్టమైన భగవంతుని స్మరిస్తూ పట్టుదలతో వారు చేసే పనిలో ముందుకు వెళితే వారిని ఎవరు ఆపలేరు.
ఎవరికో వేల రూపాయలు ఇచ్చి పూజలు చేస్తుంటాం.కానీ ఇలాంటి పూజలు మనం కూడా చేయాలి.కొంతమంది భక్తులు మనసులో ఎప్పుడు పరమేశ్వరుని ధ్యానిస్తూ ఉండేవారి జోలికి సూర్య చంద్రులే కాకుండా, రాహు కేతువులు, అష్ట గ్రాహకుటములు కూడా రాలేవు.ఎందుకంటే అది భగవంతుని స్మరించే గొప్పతనం.
ఇంకా చెప్పాలంటే పూజ గదిని ఈశాన్యం వైపు నిర్మించడం మంచిది.పెద్ద పెద్ద బంగ్లాలలో దేవునికి చిన్న గదులు కాకుండా ఒక విశాలమైన గదిని కేటాయించడం కూడా మంచిదే.
DEVOTIONAL