Anusha Shetty Naga Shourya : నాలుగు రోజుల్లోనే పెళ్లి పెట్టుకొని ఇంకా హాస్పిటల్ లోనే నాగశౌర్య.. అసలు ఏం అయింది?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.నాగశౌర్య ప్రస్తుతం సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

 Shaurya Is Still In The Hospital Will He Recover By The Time Of Marriage , Naga-TeluguStop.com

ఈ క్రమంలోనే తాజాగా నాగశౌర్య సినిమా సెట్ లో కళ్ళు తిరిగి పడిపోయిన విషయం మనందరికీ తెలిసిందే.అయితే సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేస్తూ డైట్ ఫాలో అవుతున్న నాగశౌర్య డిహైడ్రేషన్ కు గురవడంతో కళ్ళు తిరిగి కింద పడిపోయినట్లు వైద్యులు వెల్లడించారు.

కాగా నిన్నటి నుంచి ఇంకా నాగశౌర్య హాస్పిటల్ లోనే ఉన్నట్లుగా తెలుస్తోంది.కేవలం డిహైడ్రేషన్ అని చెప్పిన వైద్యులు నాగశౌర్యని ఇంకా హాస్పిటల్ నుంచి డిస్చార్జ్ చేయకపోవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

అంతేకాకుండా మరొక మరొక ఐదు రోజులలోనే పెళ్లి ఉండగా నాగశౌర్య ఈ విధంగా హాస్పిటల్లో ఉండటంపై అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.కర్ణాటక చెందిన బిజినెస్ ఉమెన్ అనూష శెట్టితో నాగశౌర్య కు పెళ్లి ఫిక్స్ అయిన విషయం తెలిసిందే.

ఈనెల 20వ తేదీన వీడి పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది.సాధారణంగా పెళ్లి అంటే పూజలు చేయడం ఉపవాసాలు ఉండడం లాంటివి చేయాల్సిందే.ఇటువంటి సమయంలో నాగశౌర్యకి ఇలా కావడం పట్ల నెటిజెన్స్ అతని కుటుంబ సభ్యులు అలాగే అభిమానులు ఆందోళన చెందుతున్నారు.ఈ విషయంపై స్పందించిన కొందరు నెటిజన్స్ హీరోయిజం చూపించడం కోసం డైట్ జిమ్ములు అంటూ తిండి మానేసి ఇలా లేనిపోని ప్రాబ్లమ్స్ ప్రాణాల మీదకు తెచ్చుకోకపోవడం బెటర్ అని కామెంట్స్ చేస్తున్నారు.

Telugu Anushka Shetty, Anusha Shetty, Naga Shourya, Nagashaurya, Nagashauryas, T

కథ బాగుంటే హీరో ఏ విధంగా ఉన్నా ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.ఈ మధ్యకాలంలో ఇదే విషయమే నిజమవుతున్న విషయం తెలిసిందే.నాగశౌర్య అభిమానులు త్వరగా కోలుకోవాలి అని కామెంట్స్ చేస్తున్నారు.గత కొద్దిరోజులుగా నాగశౌర్య పెళ్లికి సంబంధించిన వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.అంతేకాకుండా నాగశౌర్య ఇంట ఇప్పటికే పెళ్లికి సంబంధించిన పనులు మొదలైపోయాయి.ఎట్టకేలకు మా టాలీవుడ్ హీరో నాగ శౌర్య మూడుముళ్ల బంధంతో ఒక ఇంటివాడు కాబోతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube