హైదరాబాద్ గొప్ప రాజధాని నగరమని, గొప్ప నగరాన్ని పోగొట్టుకున్న గుణపాఠాలతో వికేంద్రీకరణకు నిర్ణయం తీసుకున్నామని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు.సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయంతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు.
అమరావతి రాజధాని ఉద్యమం కొందరు బడా వ్యక్తులే చేస్తున్నారని ఆరోపించారు.ఏపీకి మూడు రాజధానులే తమ ఏకైక నినాదమని తేల్చి చెప్పారు.
మూడు రాజధానుల కోసం ఎంత వరకైనా పోరాడతామని మంత్రి మేరుగ స్పష్టం చేశారు.







