Jagan Sharmila: బీసీల పై ఉక్కుపాదం?

అధికారంలోకి వచ్చిన దగ్గరనుండి మూడున్నరేళ్లు గా అయ్యన్నపాత్రుడు కుటుంబాన్ని వెంటాడు తుంది జగన్ ప్రభుత్వం.బీసీలను అణచి వెయ్యడమే లక్ష్యoగా పెట్టుకొన్నారు.

 Steel Leg On Bcs, Indians' Penal Code , Ys Rajasekhara Reddy, Banjaraheels In H-TeluguStop.com

గతంలో ఏ ప్రభుత్వం అన్నా బీసీల పట్ల ఇంత క్రూరంగా వ్యవహరించిందా? మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఎం నేరం చేసాడని పోలీసులు దొంగల్లాగా గోడలు దూకి తలుపులు పగలగొట్టి అరెస్టు చేస్తారు? ప్రభుత్వాన్ని ప్రశ్నించడం,విమర్శించడం ఆయన చేసిన నేరమా? అర్ధరాత్రి అరెస్టు చెయ్యడానికి అయ్యన్న పాత్రడు ఉగ్రవాదా?లేకుంటే ఎవరినైనా మర్డర్ చేశారా? లేకుంటే వందల ఎకరాల్లో భూములు కబ్జా చేశారా? కేవలం రెండు సెంట్ల సొంత భూమిలో నాళా నిబంధనలు పాటించలేదని అర్ధరాత్రి వందల మంది పోలీసులు గోడలు దూకి వచ్చి తలుపులు పగలగొట్టి మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిని, ఆయన కుమారుడు రాజేష్ ను అరె స్టు చేస్తారా?అయ్యన్న పై ఇప్పటీకే 10 కేసులకు పైన పెట్టారు.అయ్యన్నను అక్రమంగా అరెస్టు చెయ్యడం చట్ట విరుద్ధం.

కోర్టులో పరిష్కరించు కొనే అంశంపై పోలీసులు ఎలా అరెస్టు చేస్తారు? మున్సిపల్ శాఖకు చెందిన సివిల్ అంశంలో సిఐడి కి ఏం సంభంధం ?ఫోర్జరీ ధ్రువ పత్రాలని దేని ఆధారంగా నిర్ధారించింది సిఐడి?వైఎస్ రాజశేఖర రెడ్డి హైదరాబాద్ బంజారాహీల్స్ లో చేసిన భూ అక్రమాలను కోర్టు ద్వారా సక్రమం చేసుకోలేదా? మరి ఇడుపుల పాయలో అడ్డగోలుగా 600 ఎకరాల అసైన్డు భూమి ఆక్రమించుకొని చట్టం తెలియక ఆక్రమించుకొన్నానని అసెంబ్లీలో సమాధానం చెప్పింది నిజం కాదా? ఫోర్జరీ ధ్రువపత్రం అని అయ్యన్నపాత్రుడిని అరెస్టు చేశారు.అవినీతి గోపురాలు నిర్మించుకొన్నందుకు,రూ 43 వేల కోట్లు ప్రజాధనం దోచుకొన్న జగన్ కి ఎన్నేళ్లు జైలు శిక్ష విధించాలి?మీకో నీతి, అయ్యన పాత్రుడుకొక నీతా?ప్రభుత్వమే ఆరోపణలు చెయ్యడం,ప్రభుత్వమే నేర నిర్ధారణకు పూనుకోవడం,తనను తానూ న్యాయమూర్తిగా భావించి శిక్షను ప్రకటించి అరెస్టులు చెయ్యడం ఏ రాజ్యాoగం ప్రకారం,ఏ న్యాయశాస్త్రం ప్రకారం సబబో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి.

సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా అయ్యన్న పాత్రుడుని అరెస్టు చేయ్యడం దుర్మార్గం.ఆరోపణలు రాగానే విచారణ చెయ్యకుండా ఏ వ్యక్తిని అరెస్టు చెయ్యకూడదన్న విషయం పోలీసులకు తెలియదా?అరెస్టు చేసేముందు పోలీసులు తమని తాము ప్రశ్నించుకోవాలి.ఎందుకు అరెస్టు చెయ్యాలి?నిజంగా అరెస్టు చెయ్యడం అవసరమా ?అని.ఆ వ్యక్తి మీద వచ్చిన ఆరోపణల్లో నిజముందని పోలీసులు గుర్తించినప్పుడే అరెస్టు చెయ్యాలి.

వ్యక్తులను అరెస్టు చేసే విధానం పై సుప్రీం కోర్టు మార్గదర్శకాల్లో స్పష్టంగా వెల్లడించింది.కానీ మహోన్నత సుప్రీం కోర్టు మార్గదర్సకాలకు తూట్లు పొడుస్తూ పోలీసులు ధిక్కారంతో వ్యవహరిస్తున్నారు పోలీసులు.

మూడున్నరేళ్లుగా జగన్ రెడ్డి ఆడమన్నట్లు ఆడుతూ పోలీసులు భక్షక భటులుగా వ్యవహరిస్తున్నారు.సొంత బాబాయి వివేకానంద రెడ్డి హత్యవిషయం పై చెల్లెలు షర్మిళ వాస్తవాలు వెల్లడించింది.మరి వివేకా హత్యకేసు నిందితులను పోలీసులు అరెస్టు చెయ్యగలరా? బాబాయి హత్య విషయం పై చెల్లెలు వాస్తవాలు వెల్లడించడంతో ఆత్మరక్షణలో పడ్డ జగన్ రెడ్డి సమాధానం చెప్పలేక అసలు విషయం డైవర్ట్ చెయ్యడానికి అయ్యన్న పాత్రుడి ఇంటి పైకి వందల మంది పోలీసులను పంపి అర్ధరాత్రి అరెస్టు చేసి అసలు విషయం పక్కదారి పట్టిస్తున్నారు.

మూడేళ్ళుగా బీసీల పై అక్రమకేసులు పెట్టి వేధిస్తూ రాక్షస పాలన సాగిస్తున్నారు.

రాష్ట్రంలో బీసీలు బతకాలా వద్దా అనేంతటి దుర్బరమైన పరిస్థితి కల్పించారు.అధికారంలోకి వచ్చినప్పటి నుండి బీసీలను భయభ్రాంతులకు గురి చేస్తూ వందలాది మంది బీసీలపై దాడులు చేసి బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు.

ప్రభుత్వాన్నివిమర్శించిన వారిని అక్రమంగా అరెస్టు చేసి మానసికంగా దెబ్బతీయడమే లక్ష్యంగా వ్యవహరిస్తుంది జగన్ ప్రభుత్వం.ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం పై విమర్శలు చెయ్యడం,ప్రశ్నించడం సహజం.

అంత మాత్రానా బరితెగించి ప్రతిపక్ష బీసీ నాయకుల ఇళ్లను కూల్చడం,ప్రహరీ గోడలు కూల్చడం వారి ఆస్తులు ధ్వంసం చెయ్యడం,అర్ధరాత్రి అక్రమ కేసులు బనాయించడం వంటి చర్యలకు తెగపడతారా?ప్రజల పక్షాన పోరాడుతున్న ప్రతిపక్షాన్ని వేధించడం జగన్ ప్రభుత్వానికి ఒక వికృత క్రీడగా మారింది.

Telugu Indians Penal, Jagan, Sharmila, Steel Leg Bcs, Ysrajasekhara-Political

అధికారం లో వున్నాం ఏదైనా చేస్తాం అన్న విధంగా వ్యవహరిస్తున్నారు.జగన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న సమస్త విధానాలు అన్ని అ ప్రజాస్వామిక మైనవే కాదు.అనాలోచిత మయినవి,అసంబద్దమైనవి,నిరంకుశమైనవే,కక్షపూరితంగా అక్రమ కేసులు పెట్టి వేధించడం, వ్యక్తిగత ఆస్తులు ధ్వంసం,దాడులు చెయ్యడం, సిఐడి పోలీసులతో అక్రమ కేసులు పెట్టడం తారాస్థాయికి చేరింది.

ఇండియన్స్ ఫీనల్ కోడ్ [ఐపిసి]ని వైసిపి ఫీనల్ కోడ్ గామార్చారు.జగన్ అసమర్ధ పాలనతో ప్రతిష్ట మసక బారింది.రాష్ట్ర వ్యాప్తంగా తన పరిపాలన పట్ల పెరుగుతున్న వ్యతిరేకత పట్ల జగన్ కళ్ళల్లో, ఆయన శిభిరంలో కలవరం మొదలైంది.తన ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్దపడుతున్నారన్నవిషయం గ్రహించిన జగన్ లో అక్కసు,అసహనం పెరిగిపోతున్నాయి.

నిరాశా, నిస్పృహ అలుముకుంటున్నాయి.రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన పాపం నుండి ప్రజల దృష్టి మళ్లించెందుకు ప్రజల కళ్ళకు గంతలు కట్టేందుకు ప్రతి పక్ష నాయకులు పై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నది జగన్ ప్రభుత్వం .గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించారు.ఈ విధమైన కక్ష సాధింపులతో బీసీల ఏ ప్రభుత్వం,ఏ ముఖ్యమంత్రి వ్యవహరించలేదు.

ఈ తరహా విధ్వంసం,కక్ష సాధింపులు కొనసాగించినంతకాలం జగన్ కి రాజకీయంగా నష్టమే తప్ప లాభం ఉండదని జగన్ గుర్తించాలి.బీసీల ఆత్మగౌరవం దెబ్బ తీస్తున్నది జగన్ ప్రభుత్వం.

కావునా బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాల్సిన అత్యవసరం ఏర్పడింది.ఒక పక్కన బీసీలను ఉద్ధరిస్తున్నట్లు బులిపిస్తున్న జగన్ రెడ్డి మరోపక్క బీసీల పై అక్రమకేసులు పెట్టి వేధిస్తూ బీసీలను రాష్ట్రం నుండి వెళ్లగొట్టె పరిస్థితి తెస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube