తెలంగాణ రాష్ట్రంలోని మునుగోడు శాసనసభ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలలో ఓటర్లు పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులను మరియు ఇండిపెండెంట్ అభ్యర్థులలో ఎవరికి పట్టం కట్టనున్నారు.ఎవరిని మురిపిస్తారు.?విజేతలెవరు .?ఓటమి చవిచూసేది ఎవరు.? మునుగోడు ఎన్నికల్లో ఓటర్ల తిర్పు ప్రభుత్వ పనితీరుకు రాజకీయ మార్పుకు అభివృధి మలుపుకు దిక్సూచి కానుందా ? అని రాష్ట్రంలోని ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.గత రెండు నెలలుగా ఇతర ప్రాంతాల నుండి వివిధ పార్టీల తరపున ప్రచారం చేసిన నాయకులు వారి సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు.
ఈ నియోజకవర్గంలో గత కొన్ని రోజుల నుండి మద్యం ఏరులై పారింది.యువత రాజకీయ పార్టీల ప్రలోబాలకు మద్యం కు అలవాటుపడి సోమరితనం పెరిగి గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఉత్పాదక కార్యక్రమాలు దెబ్బతిన్నాయి.
అన్ని రాజకీయ పార్టీలు ఇతర ప్రదేశాల కు చెందిన కార్యకర్తలతో ఎన్నికల ప్రచార శిబిరాలు పోటీ పడి నిర్వహించాయి .స్థానిక కార్యకర్తల ఇండ్లలో ఇతర ప్రదేశాల నుండి వచ్చిన కార్యకర్తలకు నివాస సౌకర్యం కల్పించడ ములో అవాంచనీయ సంఘటనలు చోటుచసుకున్న వార్తలు హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకోవడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ ప్రచారం కొరకు చాలా డబ్బులు ఖర్చు చేయడం జరిగింది.ఒక్కొక్క ఓటును ఎంతో శ్రమపడి.ఎంతో ఖర్చు చేసి.ఎన్నో రకాలుగా ప్రచారాలు నిర్వహించి.అమలు జరగని అమలుకు నోచుకోని అంచనాలకు మించి హామీలు ఇవ్వడం జరిగింది.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి.కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ అభ్యర్థి.జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్ పార్టీ.బహుజన సమాజ్ పార్టీ.
కొన్ని ప్రాంతీయ పార్టీలు.కొన్ని జాతీయ పార్టీలు.
కొందరు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు.ఎన్నికల కోసం కుల సంఘాలఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి ఓటుబ్యాంకు సుస్థిరత కొరకు పార్టీలు పరస్పరం పోటీ పడ్డాయి.
ఓట్ల అంచనాలు.గతంలో ఈ స్థానం నుండి ప్రాతినిధ్యం వహించిన పార్టీల యొక్క జనబలం.
ఓట్ల అంచనాలు వేసుకోవడం జరిగింది.వివిధ పార్టీల తరఫున ఆయా పార్టీల ముఖ్య నాయకులు ప్రచారం నిర్వహించడం జరిగింది.
ఈ ఎన్నిక కొన్ని పార్టీలకు సవాలుగా మరియు రెఫరెండంగా మారనుంది దనస్వామ్యం ప్రజాస్వామ్యం మధ్య పోటీగా పరినమించనుంది .ఈ ఎన్నిక 2024 లో జరగబోయే ఎన్నికకు రూట్ మ్యాప్ గా ఏర్పడి రాజకీయ పార్టీల ఏకీకరణకు మార్గదర్షిగా ఆదర్శంగా మారనున్నది.రాష్ట్రంలో జరిగిన వివిధ ఉప ఎన్నికల ఫలితాలను కూడా వివిధ రాజకీయ పార్టీలు అంచనాలు వేసుకుంటున్నాయి.భవిష్యత్ రాజకీయాలకు రాజకీయ వ్యూహాలను రూపొందించుకోవడానికి ఈ ఉపఎన్నికల అనుభవాలు ఆలంబనగా నిలువనున్నాయి.
ధన బలం.జనబలం.కుల బలం.పార్టీ బలం.నాయకుల బలం.సన్నిహితుల బలం.కంటె ఓటర్లకు పోటీ చేసే అభ్యర్థుల పట్ల వున్న విశ్వసనీయత ఓటర్ల మనోబావాలను ఎవరైతే గెలుస్తారో వారే విజేతలు అవుతారు .ఓటరు మహాశయుల ఆశీర్వాదం చాలా ముఖ్యం.కేవలం “సేవా బావం”తొ.నీతి నిజాయితీ నమ్ముకొన్న విలువలు గల రాజకీయాలను నమ్ముకొని ఉన్న నాయకులకు ఈ ఉప ఎన్నిక ఒక అగ్ని పరీక్ష లాగా వుంది.
ఈ ఉప ఎన్నికఫలితాల కోసం క్షణక్షణం ప్రతిక్షణం ఎదురు చూడవలసిన పరిస్థితి దాపురించింది.ఉప ఎన్నికలు సాధారణంగా రెండు సందర్భాలలో జరుగుతాయి .మొదటిది ప్రజాప్రతినిధిగా ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి అనుకోకుండా జరగరాని సంఘటన అనారోగ్య కారణాలతో మరణించిన సందర్భంలో.రెండవది ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి రాజీనామా చేస్తే ఆరు నెలల లోపు గా ఎన్నికలు జరపవలసి ఉంటుంది.నేటి రాజకీయాలు ఓట్లను నోట్లతో కొనుక్కునే పరిస్థితిదాపురించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా పరిణమించడం శోచనీయం .“అమెరికా మాజీ అధ్యక్షులు” ప్రజా ప్రతినిధి గురించి చెప్పిన రెండు మాటలు ఇక్కడ గుర్తు చేసుకోవాలి.“మొదటిది బుల్లెట్ కంటే బ్యాలెట్ గొప్పది.“ఐదు సంవత్సరాల కాల పరిమితి కోసం వేసే ఓటు ఆలోచించి వేయాలని.“రెండవది ప్రజా ప్రతినిధి అనగా ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకొనబడే వ్యక్తి ప్రజల అభిప్రాయాలను కూడా గౌరవించాలి.” సొంత నిర్ణయాలు వ్యక్తిగత ఆలోచనలు తీసుకొనకూడదు.భారతదేశం ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్య దేశం మనది.
పూర్వకాలంలో లాగా రాజుల పరిపాలన పోయి ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు హక్కు ద్వారా ప్రజా ప్రతినిధిని ఎన్నుకునే విధానం మనది.నాటికి నేటికి ప్రజాస్వామ్యం.ప్రజా ప్రతినిధి.
ఓటు విలువ.ఎన్నికలలో ప్రచారం.
ఎన్నికల కోసం చేసే ఖర్చు.చెప్పే హామీలు.
భారత దేశ రాజకీయ రంగములో చర్విత చరణమైనాయి.దేశస్వాతంత్ర తొలి రోజుల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు గత కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికలకు ప్రస్తుతం.జరుగుతున్న ఎన్నికలకు చాలా తేడాలు ఉన్నాయి.స్వాతంత్రానికి పూర్వం ధనవంతులకు.చదువుకున్న వారికి.కొన్ని కులాలకు మాత్రమే ఓటు హక్కు ఉండేది.
కానీ భారత రాజ్యాంగ నిర్మాత.భారతరత్న.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరునికి కుల’ మత భేదం.’ లింగ భేదం.స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతి పౌరునికి ఓటు హక్కు కల్పించడం జరిగింది.
గ్రామపంచాయతీ నుండి పార్లమెంట్ వరకు ఓటు హక్కు ద్వారా వార్డు మెంబర్ నుండి పార్లమెంట్ సభ్యుని వరకు ఓటు హక్కు ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది.ఓటు హక్కుతో ప్రజాస్వామ్య రక్షణ మరియు ప్రజాప్రతినిధులను అభివృధి కొరకు ప్రశ్నించే హక్కును ఓటరు కలిగి వున్నాడు.
ఓటు హక్కు తోనే అభివృధి లో వాటా పొందే అవకాశం ప్రతి ఓటరు కు భారత రాజ్యాంగం కల్పించిన చట్టబద్ద మైన బాధ్యత.సక్రమ వినియోగంతో సత్వరాభివృద్ది సాధ్యమౌతుంది.