తమిళనాడు నుండి కన్యాకుమారి వరకు చేపట్టిన యాత్రకు ప్రజలలో రాహుల్ గాంధీ గారికి ప్రజల మద్దతు లభిస్తుంది పాదయాత్రలో తనతో అడుగులు వేస్తూ ప్రజలు యువత అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలుపుతున్నారు అనేక సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న యాత్ర తెలంగాణలోకి అడుగుపెట్టి రాజధానిలో భారీ ఎత్తున ప్రజల యువత మద్దతుతో కొనసాగుతున్నది ఇతర రాష్ట్రాలలో కొనసాగినప్పుడు తెలంగాణ రాష్ట్ర యువ నాయకులు పాల్గొన్నారు యాత్రలో రాహుల్ గాంధీతో నడుస్తున్న నారీమణులు తెలంగాణ నుండి కూడా ఉన్నారు.భారీ సంఖ్యలో యువత యాత్రలో పాల్గొంటున్నారు ప్రజల మద్దతు లభిస్తుంది.
సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న యాత్ర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఎంతగానో ఉపయోగపడుతుంది గ్రామస్థాయి నుండి పార్టీకి బలమైన నాయకత్వం కార్యకర్తలు ఉన్న పార్టీ కాబట్టి రాహుల్ గాంధీ గారి యాత్రలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇంతగానో బలాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది.క్రియాశీలకంగా పార్టీకి పనిచేసే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నా పార్టీ కాబట్టి అందరినీ కలుపుకొని పోయి అవకాశం ఉన్నందున కొన్ని లోపాలను సరిదిద్దు కొని దేశం మొత్తం యాత్ర చేపడితే ఎక్కడ సమస్యలు ఉన్నవి లోపాలు మరియు పార్టీ బలోపెతం చేయడానికి ఆలోచనలు నిర్ణయాలు తీసుకొని అవకాశం ఉంటుంది.
ఇంకా ప్రజలలో ప్రజల దగ్గరికి వెళ్లినప్పుడు వారి సమస్యలు దగ్గరగా చూసే అవకాశం లభిస్తుంది.కాబట్టి భారత్ జోడోయాత్ర కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తుంది.
ఇంకా రాహుల్ గాంధీ ప్రజలలో ఉండేటట్లు నిర్ణయాలు తీసుకొని ఎక్కువగా పాదయాత్ర దేశంలోని అన్ని నియోజకవర్గాలు పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రతి నియోజకవర్గానికి పోయే విధంగా రూట్ మ్యాప్ తయారుచేసుకుని ఎక్కువగా ప్రజలలో ఉండేటట్లు చూసుకోవాలి.అన్ని సామాజిక వర్గ ప్రజల దగ్గరికి వెళ్లి సమస్యలు తెలుసుకున్నప్పుడు భవిష్యత్తులో అది పార్టీకి భారీ పలితాలను ఇస్తుంది.
కులాలుగా మతాలుగా విడదీసే ఆలోచన జరుగుతున్నందున భారతీయులందరూ ఒక్కటే అనే నినాదంతో భారత్ జోడో యాత్ర అన్ని పార్టీలకు అతీతంగా ప్రారంభించారు రాహుల్ గాంధీ గారు చేపట్టిన యాత్రలో పార్టీ జెండాలు కాకుండా మన జాతీయ జెండా చేతబట్టి యువత ప్రజలు కదలి రావాలి అని పిలుపునిచ్చారు ఆ విధంగానే జాతీయ జెండా చేతబట్టి భారీ సంఖ్యలో యువత ప్రజలు యాత్రలో పాల్గొంటున్నారు దేశం ఏకం చేసే భారతీయులందరూ ఒక్కటే అనే నినాదంతో రాహుల్ గాంధీ గారు యాత్ర చేపడుతున్నారు.
తెలంగాణలో విద్యార్థి ఉద్యమ నాయకులు విద్యార్థులు యువత ప్రజలు యూనివర్సిటీ విద్యార్థులు భారీ సంఖ్యలో రాహుల్ గాంధీ గారిని కలుస్తున్నారు మేధావులు పాత్రికేయులతో సమావేశాలు కూడా జరుపుతున్నారు రాష్ట్ర సమితిలో అన్ని తెలుసుకుంటూ తెలంగాణ భారత్ జూడో యాత్ర విజయవంతంగా ముందుకు సాగుతున్నది ఢిల్లీ నుండి గల్లీలోకి అడుగుపెట్టిన రాహుల్ గాంధీ గారిని కలవడానికి యువత ప్రజలు అన్ని సామాజిక వర్గ ప్రజలు పోటీపడి మరి కారాచలనం చేస్తున్నారు భారత్ జోడో యాత్ర తెలంగాణలో రాజకీయంగా కూడా భవిష్యత్తులో లాభాలు చేకూరుతుంది పార్టీ నాయకులను సమన్వయం చేసి అందర్నీ కలుపుకొని పోతే భవిష్యత్తులో పార్టీకి మంచి ఫలితాలు వస్తాయి.