ప్రస్తుత వైసిపి మంత్రులు , ఎమ్మెల్యేలు చాలామంది రాబోయే ఎన్నికల్లో తమకు బదులుగా తమ వారసులను రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పటికే తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని పార్టీ , ప్రభుత్వ కార్యక్రమాలలో తమ వారసులను భాగస్వామ్యం చేస్తూ… ప్రజల్లోకి పంపుతున్నారు.
ఎన్నికల సమయంలో మాత్రమే వీరిని జనాల్లోకి పంపితే ఇబ్బందులు ఏర్పడతాయనే ఉద్దేశంతో ముందు నుంచి జనాలకు పరిచయం చేస్తూ పార్టీ నాయకులు తో సన్నిహిత సంబంధాలు ఏర్పడే విధంగా ప్లాన్ చేస్తున్నారు.ఈ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇలా అందరూ ముందస్తు ప్లాన్ తో ఉన్నారు. టికెట్ ఆశిస్తున్న వారసులు వీరే…? తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు తిరుపతి డిప్యూటీ మేయర్ గా ఉన్న అభినయ రెడ్డి, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ కుమారుడు పోలాకి జడ్పిటిసి డాక్టర్ కృష్ణ చైతన్య అసెంబ్లీ స్పీకర్ ఆముదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం కుమారుడు చిరంజీవి వెంకట నాగ్.శాసనసభ డిప్యూటీ స్పీకర్ విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి కుమార్తె విజయనగరం డిప్యూటీ మేయర్ శ్రావణి.
ఎలమంచిలి ఎమ్మెల్యే రమణమూర్తి రాజు కుమారుడు సుకుమార్ వర్మ.రామచంద్రపురం లో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ కుమారుడు నరేన్, అలాగే ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు పిల్లి సూర్య ప్రకాష్.
మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తి.
ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి కుమారుడు ప్రణీత్ రెడ్డి.వైసిపి ఎమ్మెల్సీ మండపేట ఇంచార్జ్ తోట త్రిమూర్తులు కుమారుడు పృథ్వీరాజ్ఎ లా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది వారసులే పొలిటికల్ ఎంట్రీ 2024 లో ఇచ్చేందుకు , ఎమ్మెల్యేలుగా తండ్రుల వారసత్వాన్ని నిలబెట్టేందుకు సిద్ధమవుతున్నారు.అయితే వీరి ఆశలు తీరేలా కనిపించడం లేదు.
రాబోయే ఎన్నికల్లో వారసులకంటే ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న మీరే పోటీ చేయాలని జగన్ తాజాగా తేల్చి చెప్పడంతో వీరందరి ఆశలపై నీళ్లు చిమ్మినట్టు అయింది.ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐపాడ్ టీం నిర్వహించిన సర్వేలో కొత్త మోకాలు కంటే ప్రజలకు సుపరిచేతమైన ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్లు తీస్తే గెలుపు శాతం మరింత ఎక్కువగా ఉంటుందని రిపోర్ట్ ఇవ్వడంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారట.