బెంగళూరు వాసులకు శుభవార్త... త్వరలో హెలికాప్టర్ సేవలు ప్రారంభం!

ఇండియాలోని ప్రముఖ నగరం అయినటువంటి బెంగళూరులో ట్రాఫిక్ ఎంత అధికంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అక్కడ స్థానికులను ట్రాఫిక్ నిత్యం వేధిస్తూనే ఉంటుంది.

 Good News For Bengaluru Residents Helicopter Services To Start Soon , Banglore,-TeluguStop.com

అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఒక ఎయిర్ మొబిలిటీ ప్రొవైడర్ సిద్ధమైంది.అవును, బెంగళూరు సిటీలో సూపర్‌ఫాస్ట్‌గా ట్రావెల్ చేసేందుకు హెలికాప్టర్ సర్వీసులను పరిచయం చేయాలని యోచించింది.

ఈ కంపెనీ అక్టోబర్ 10 నుంచి కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఎయిర్‌పోర్ట్‌ మధ్య హెలికాప్టర్‌ సర్వీసులు లాంచ్ చేస్తోంది.

ఈ సర్వీసు వలన ప్రయాణికులు ట్రాఫిక్‌లో 120 నిమిషాల ప్రయాణానికి బదులుగా కేవలం 15 నిమిషాల్లో హెలికాప్టర్ ద్వారా తమ గమ్యస్థానానికి చేరుకోవచ్చు.

కెంపేగౌడ విమానాశ్రయం, HAL విమానాశ్రయం మధ్య 43 కి.మీ దూరం వుంటుందనే విషయం తెలిసినదే.ఈ రూట్‌లో సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9 గంటలకు ఒకటి, సాయంత్రం 4.15 గంటలకు ఇంకొకటి.మొత్తంగా 2 ట్రిప్స్ ఉంటాయి.డిమాండ్ ని బట్టి ఈ ట్రిప్స్ మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.

ఇక టికెట్ ధరల విషయానికొస్తే, కొంచెం ఖరీదుతో కూడుకున్నదే.ఒక్కో ప్యాసింజర్‌కి వన్-వే టికెట్ ధర రూ.3,250గా కంపెనీ నిర్ణయించినట్టు సమాచారం.ఈ టికెట్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.

ప్రయాణికులు ల్యాండింగ్‌కు ముందే సేవలు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.ఈ సర్వీస్ విండో సమయంలో ఎయిర్‌పోర్ట్ వద్దకు చేరుకోలేని వారు తమ బుకింగ్ క్యాన్సిల్ చేసుకోవచ్చు.

ఫ్లై బ్లేడ్ హెలికాప్టర్ సేవలు బెంగళూరులోని వైట్‌ఫీల్డ్, ఎలక్ట్రానిక్ సిటీలకు కూడా త్వరలోనే విస్తరించనున్నాయి అని ఈ సందర్భంగా తెలియజేసారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube