మనుషులను మనుషులు పోలి ఉండటం సహజం.అలా ఏడు మంది ఉంటారని ఒకరు చెబితేనే తెలిసేది.
కానీ చూసేవారికు ఎవరు నమ్మకం పట్టరు.ఎందుకంటే ఒక అమ్మాయిని పోలి మరో అమ్మాయి లేదా ఒక అబ్బాయిని పోలి మరో అబ్బాయి ఉండటం సహజమే ఎందుకంటే అది ఎక్కువగా కవలులో చూస్తాము.
మరీ అలా కాకుంటే ఎక్కడో ఓ చోట కాస్త పోలికలతో ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటాము.అలా తాజాగా నయనతార లా ఉన్నావు అంటూ ఒక హీరోయిన్ పై కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్.
నిజానికి కొన్ని కొన్ని సార్లు కొందరు హీరోయిన్లు వేరే హీరోయిన్ లా కనిపిస్తూ ఉంటారు.ఇప్పుడు నయనతారల ఉన్న హీరోయిన్ ఫేస్ బాగా వైరల్ అవుతుంది.
ఇంతకు ఆమె ఎవరో కాదు.చాందిని చౌదరి.తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన చాందిని. ఈ మధ్య మంచి సక్సెస్ అందుకొని మంచి అభిమానం సంపాదించుకుంది.కెరీర్ మొదట్లో ఈ ముద్దుగుమ్మ పలు షార్ట్ ఫిలిమ్స్ లలో నటించింది.దాంతో అక్కడ మంచి సక్సెస్ అందుకోవడంతో వెండితెరపై అవకాశం అందుకుంది.
వెండితెరపై అడుగుపెట్టిన మొదట్లో చాలావరకు అంత సక్సెస్ అందుకోలేకపోయింది.
![Telugu Color, Nayanathara, Sammathame, Tollywood-Movie Telugu Color, Nayanathara, Sammathame, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2022/09/Chandini-Chowdary-Latest-Photos-Viral.jpg)
తొలిసారిగా 2012లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో పరిచయమైంది.ఆ తర్వాత ఏడాది ప్రేమ ఇష్క్ కాదల్, కేటుగాడు, బ్రహ్మోత్సవం, కుందనపు బొమ్మ, శమంతకమణి, లై, హౌరా బ్రిడ్జి వంటి సినిమాలలో నటించగా తను నటించిన పాత్రలు అంతగా గుర్తింపు తెచ్చుకోలేనివి.కానీ 2020 లో విడుదలైన కలర్ ఫోటో సినిమాతో మాత్రం హీరోయిన్ గా మంచి సక్సెస్ అందుకుంది.
ఆ సినిమాతోనే మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఇక ఈ సినిమా తర్వాత వరుసగా పలు సినిమాల్లో నటించింది.
అందులో సమ్మతమే అనే సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన నటించింది.ఈ సినిమా తనకు మంచి సక్సెస్ అందుకుంది.
ఆ తర్వాత కూడా వరుసగా అవకాశాలు అందుకుంటుంది.ఇదిలా ఉంటే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.
![Telugu Color, Nayanathara, Sammathame, Tollywood-Movie Telugu Color, Nayanathara, Sammathame, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2022/09/Netizens-Comments-on-Chandini-Chowdary-New-Look.jpg)
నిత్యం తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది.ఇక ఈ మధ్య ఈ ముద్దుగుమ్మ కూడా మరిన్ని అవకాశాలు అందుకోవటం కోసం గ్లామర్ షో కూడా చేస్తుంది.పొట్టి పొట్టి బట్టలతో కూడా అందరికీ షాక్ ఇస్తుంది.ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తనకు సంబంధించిన ఒక ఫోటో పంచుకుంది.ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.అందులో తన లుక్ చాలా వరకు నయనతార లాగా కనిపించింది.
దీంతో ఆ ఫోటోని చూసినా నెటిజన్స్ అచ్చం నయనతారలా ఉన్నావు అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు.ప్రస్తుతం ఆ కామెంట్లు కూడా బాగా వైరల్ గా మారాయి.