కొంతమంది వల్ల నెగటివ్ అవుతున్నావ్ అరియనా.. అర్థం చేసుకో.. నెటిజన్ కామెంట్ వైరల్!

బిగ్ బాస్ సీజన్ 4 బోల్డ్ బ్యూటీ అరియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ షో తో ఎనలేని క్రేజ్ ను సంపాదించుకొని సెలబ్రిటీ హోదాను అందుకుంది.

 Tollywood, Ariyana Glory, Ariyana Instagram, Ariyana Trolls, Bigg Boss Season 4-TeluguStop.com

పైగా నాన్ స్టాప్ బిగ్బాస్ లో కూడా పాల్గొని మరింత క్రేజ్ సంపాదించుకుంది.తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సొంతం చేసుకుంది అరియానా.

ఎంతో మంది అభిమానులను సంపాందించుకుంది.తన కెరీర్ ను మొదటగా యూట్యూబ్ లో యాంకర్ గా మొదలు పెట్టింది.

నిజానికి తన కెరీర్ ఇక్కడి నుండే ప్రారంభమమైంది.గతంలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేయగా.

ఆమెపై వర్మ చేసిన బోల్డ్ కామెంట్లతో సెలబ్రిటీగా మారింది.ఒక్క ఇంటర్వ్యూతో వర్మ చేతిలో చిక్కిన అరియానా బాగా హాట్ టాపిక్ గా మారి క్రేజ్ సంపాదించుకుంది.

అలా వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 లో అవకాశం అందుకుంది.ఇందులోనే తన పరిచయాన్ని మరింత పెంచుకుంది.ఎంట్రీ తోనే బాగా వైలెంట్ గా నిలిచింది.అంతేకాకుండా హౌస్ లో మరో కంటెస్టెంట్ సోహెల్ తో బద్ధశత్రువుగా ఉండి మరింత రచ్చ చేసింది.

అలా చివరి రోజుల్లో మంచి ఫ్రెండ్స్ గా మారారు.ఇక హౌస్ నుండి బయటకు వచ్చాక కూడా వీరి మధ్య ఫ్రెండ్ షిప్ మరింత బలపడింది.

ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసి వెళ్లేవాళ్లు.ఇక సోషల్ మీడియాలో ఇద్దరు కలిసి దిగిన ఫోటోలను కూడా బాగా పంచుకునే వాళ్ళు.

ఇక ప్రస్తుతం పలు ప్రాజెక్టులలో బిజీగా ఉంది అరియానా.ఇక ఓవైపు సోషల్ మీడియాలో బిజీగా ఉంటూ తన ఫాలోవర్స్ అప్పుడప్పుడు ముచ్చట్లు కూడా పెడుతుంది.

Telugu Ariyana Glory, Ariyana, Ariyana Trolls, Tollywood-Movie

గతంలో పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించింది.అవి కూడా చాలా వరకు క్లిక్ మనిపించాయి.ఇక ఈ బ్యూటీ కి ఖాళీ సమయం దొరికితే చాలు తన ఫ్రెండ్స్ తో కలిసి బయట తిరుగుతూ బాగా ఎంజాయ్ చేస్తుంది.ఇక ఆ మధ్య కొత్త కారు కొనడంతో అప్పటినుంచి తన కారులో తెగ షికారులు కొడుతూ వాటికి సంబంధించిన వీడియోలను పంచుకుంటూ ఉంటుంది.

ఇక నాన్ స్టాప్ బిగ్ బాస్ నుండి అరియానా బాగా నెగటివ్ కామెంట్స్ ఎదురుకుంటుంది.అయినా కూడా అవేవీ పట్టించుకోకుండా తను లైఫ్ ఏంటో తాను ఎంజాయ్ చేస్తుంది.

Telugu Ariyana Glory, Ariyana, Ariyana Trolls, Tollywood-Movie

ఇదిలా ఉంటే తాజాగా తను ఓ ఫోటో పంచుకోగా అది బాగా వైరల్ అవుతుంది.ఇక ఆ ఫోటో చూసిన ఒక నెటిజన్.నువ్వు కొంతమంది వల్ల నెగటివ్ కాకుండా ఉండాలి అని ఒక మంచి కోరే వ్యక్తిగా చెబుతున్నాను అంటూ.ఎందుకంటే ఆడియన్స్ నిన్ను ఒక ఫ్యామిలీ మెంబర్స్ గా చూసుకుంటున్నారు అని.నాకు తెలుసు నువ్వు అర్థం చేసుకుంటావు అని.అర్థం చేసుకునేది నీలో మంచితనం అని కామెంట్ పెట్టగా ప్రస్తుతం అది బాగా వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube