ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.06
సూర్యాస్తమయం: సాయంత్రం 06.26
రాహుకాలం:మ.1.30 ల3.00 వరకు
అమృత ఘడియలు:ఉ.8.00 ల10.00 సా 4.00 ల 5.10 వరకు
దుర్ముహూర్తం: ఉ.10.14 ల11.05 మ3:21 సా4.12 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు మంచి ఆలోచనలతో కొన్ని కొత్త వ్యాపారాలు మొదలు పెడతారు.సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అంటుతుంది.తోటి వారి సహాయంతో అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.
వృషభం:
ఈరోజు మీరు తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు.ఈరోజు కొందరి ప్రవర్తన మీ మనసులో బాధ కలిగిస్తుంది.స్నేహితులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా గడుపుతారు.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
మిథునం:
ఈరోజు మీ కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు ఎదుర్కొంటారు.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.పిల్లలు చదువు పట్ల శ్రద్ధ వహించాలి.అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడమే మంచిది.
కర్కాటకం:
ఈరోజు మీరు బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.సమాజంలో ఈరోజు మీరు గౌరవ ప్రతిష్టాలను పొందుతారు.ఎప్పటినుండ ఉన్న కోర్టు సమస్యల నుండి ఈరోజు మీరు బయట పడతారు.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
సింహం:
ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోండి.తోటి వారి సహాయం మీకు ఎప్పుడు ఉంటుంది.
కన్య:
ఈరోజు మీరు ఆర్థికపరమైన విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి.మీరంటే గిట్టని వారు మీపై నిందలు మోపుతారు.ఈరోజు మీరు అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండడమే మంచిది.కొన్ని వర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది.
తులా:
ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.ఈరోజు మీ చిన్ననాటి స్నేహితులు మిమ్మల్ని కలుస్తారు.వారితో చాలా ఉత్సాహంగా ఉంటారు.
వృశ్చికం:
ఈరోజు మీకు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.తరచు మీ నిర్ణయాలు మార్చుకోవడం వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యా అవకాశం ఉంది.కొన్ని చెడు సమాసాలకు దూరంగా ఉండటమే మంచిది.మీ విలువైన సమయాన్ని అనవసరంగా వృధా చేయకండి.
ధనస్సు:
ఈరోజు విద్యార్థులు చదువుపై మరింత దృష్టి పెట్టాలి.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే మంచిది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.అనవసరమైన ఆలోచనలు తగ్గించుకోవడం మంచిది.
మకరం:
ఈరోజు మీ మనసులో ఏదో తెలియని ఆందోళన ఉంటుంది.మీరు ఏ పని మొదలుపెట్టిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.
కుంభం:
ఈరోజు మీరు చేసే వ్యాపారంలో ఆదాయం తగ్గుతుంది.ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది.
ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
మీనం:
ఈరోజు మీరు చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది.స్నేహితుల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.భవిష్యత్తులో పెట్టుబడిన నుండి మంచి ఆదాయాన్ని పొందుతారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.
DEVOTIONAL