వరంగల్ లో బీజేపీ సభను అడ్డుకునేందుకు అనేక కుట్రలు చేశారని పార్టీ చీఫ్ బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.కుట్రపూరితంగా పాదయాత్రలో దాడికి ప్రయత్నించారని ఆరోపించారు.
ప్రజాసంగ్రామ యాత్రలో ఈ దాడులను సాకుగా చూపి సభను అడ్డుకోవాలనుకున్నారని మండిపడ్డారు.కేసీఆర్ కుటుంబ అవినీతిపై ప్రజల్లో చర్చ జరగకూడదనే ఘర్షణ వాతావరణం ఏర్పడేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికార పార్టీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా బీజేపీని ఏం చేయలేరని ధీమా వ్యక్తం చేశారు.