చాలా మంది కామన్ గా ఫేస్ చేసే చర్మ సమస్యల్లో డార్క్ అండర్ ఆర్మ్స్ ఒకటి.అందులోనూ స్లీవ్‌లెస్ డ్రెస్‌లను ధరించే వారికి డార్క్ అండర్ ఆర్మ్స్ మరింత పెద్ద సమస్యగా మారుతుంటుంది.
ఈ క్రమంలోనే అండర్ ఆర్మ్స్ నలుపును వదిలించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తుంటారు.అలాగే కొందరైతే ట్రీట్మెంట్స్ కూడా చేయించుకుంటారు.
కానీ, ఇంట్లోనే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ టిప్స్ ను పాటిస్తే.డార్క్ అండర్ ఆర్మ్స్ కు సహజంగానే స్వస్తి చెప్పొచ్చు.
మరి ఇంకెందుకు లేటు ఆ టిప్స్ ఏంటో కిందకు ఓ లుక్కేసేయండి.
ముందుగా రెండు టేబుల్ స్పూన్ల పెరుగును పల్చటి వస్త్రంలో వేసి నీరును తొలగించాలి.
ఇలా నీరు తొలగించిన పేరుగులో రెండు టేబుల్ స్పూన్ల టమాటో జ్యూస్, రెండు టేబుల్ స్పూన్ల ఆరెంజ్ పీల్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అండర్ ఆర్మ్స్ లో అప్లై చేసి కంప్లీట్‌గా డ్రై అవ్వనివ్వాలి.
ఆపై తడి చేతులతో మెల్లగా రుద్దుకుంటూ వాటర్‌తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.అనంతరం ఏదైనా మాయిశ్చరైజర్‌ను రాసుకోవాలి.ఇలా రోజుకు ఒకసారి చేశారంటే డార్క్ అండర్ ఆర్మ్స్ వైట్‌గా మరియు మృదువుగా మారతాయి.
అలాగే బ్లెండర్ తీసుకుని అందులో ఒక కప్పు బొప్పాయి ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న బొప్పాయి పేస్ట్‌లో వన్ టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని అండర్ ఆర్మ్స్ లో పట్టించి.
సున్నితంగా మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి.అనంతరం వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి.
ఈ సింపుల్ చిట్కాను డైలీ ఫాలో అయినా డార్క్ అండర్ ఆర్మ్స్ కు బై బై చెప్పొచ్చు.