ఓటు బ్యాంకు పెరిగిందంటున్న వైసీపీ.. మ‌రి వ్య‌తిరేక‌త మాటేమిటీ..?

ఏపీలో అధికార పార్టీ వైసీపీకి భారీ ఎత్తున ఓటు బ్యాంక్ పెరిగింద‌ని చెబుతున్నారు.పార్టీలో కీల‌క నేత‌లూ.

 Ycp Says That The Vote Bank Has Increased And What Is The Opposition , Cm Jagan,-TeluguStop.com

స‌ల‌హాదారులూ ఇదే మాట అంటున్నారు.కాగ గ‌త ఎన్నిక‌ల‌లో వైసీపీ ఓటు బ్యాంకు 49.7 శాతంగా ఉంది.అయితే ప్ర‌స్తుతం భారీగా పెరిగింద‌ని.

మొత్తానికి మొత్తం సీట్లు త‌మ‌వే న‌ని గొప్ప‌లు చెప్పుకుంటున్నారు.అయితే గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీకి అనూహ్యంగా 151 అసెంబ్లీ స్థానాలు.22 ఎంపీ స్థానాలు దక్కాయి.ఫలితంగా పార్టీ ఏపీలో అతి పెద్ద పాలక పక్షంగా అవతరించింది.

అయితే ఇప్పుడు వైసీపీ నాయకులు తమ ఓటు బ్యాంకు ఏకంగా 57 నుంచి 58 శాతం వరకు పెరిగిందని చెప్పుకుంటున్నారు.దీనిపై పెద్ద ఎత్తున లెక్కలు కూడా చెబుతున్నారు.

పార్టీకి ప్రజల్లో ఓటు బ్యాంకు పెరిగిందని.మద్దతు కూడా పెరుగుతోందని.

వ్యాఖ్యానిస్తున్నారు.స్థానిక సంస్థల ఎన్నికలు.

తిరుపతి ఉప ఎన్నిక బద్వేలు నెల్లూరు ఉప ఎన్నికల్లో వచ్చిన విజయాన్ని ఓటు బ్యాంకును నాయకులు ప్రస్తావిస్తున్నారు.

మొత్తానికి మొత్తం సీట్లు వచ్చే ఎన్నికలకు సంబంధించి భారీ లక్ష్యం ముందుంచారు.

మొత్తం 175 స్థానాలకు 175 సీట్లు సాధించాల‌ని టార్గెట్ గా పెట్టుకున్నారు.అలాగే 25 ఎంపీ స్థానాలకు.25 చోట్లా విజయం దక్కించుకోవాలని చూస్తున్నారు.ఆ దిశగా నాయకులు కృషి చేయాలని కూడా చెబుతున్నారు.

ఇక ట్విస్ట్ ఏంటంటే.పార్టీ అధినేత.

ఇతర సలహాదారులు చెబుతున్న మాటలపై సొంత పార్టీ నాయకుల్లోనే తర్జన భర్జన మొద‌లైంది.ప్రస్తుతం నాయకులు ప్ర‌జ‌ల్లోకి వెళ్తున్నారు.

గడప గడప‌కూ ప్ర‌భుత్వం కార్యక్రమంలో ఇంటింటికీ తిరుగుతున్నారు.ఈ క్రమంలో ప్రజలనుంచి తీవ్ర వ్యతిరేకత వ‌స్తోంది.

దీనిని అంచనా వేస్తున్న వైసీపీ నాయకులు.గ్రాఫ్ పెరగకపోగా డౌన్ అవుతోందని చెప్పుకుంటున్నారు.

ప్రతిపక్షం టీడీపీ.మరో వైపు జనసేన వైపు ప్రజలు చూస్తున్నారనే సంకేతాలు వస్తున్నాయని అంటున్నారు.

Telugu Chandra Babu, Cm Jagan, Vote Bank-Political

ఇటీవ‌ల ఎమ్మెల్యేలు, మంత్రుల‌కు కూడా ఈ కార్య‌క్ర‌మంలో నిర‌స‌న సెగ త‌గిలింది.అయితే ఓటు బ్యాంక్ పెరిగింద‌ని చెప్పుకోవ‌డం రాజకీయ‌మేనా.అంటున్నారు.ఒక‌వేళ ఓటు బ్యాంకు పెరిగి ఉంటే.ప్రభుత్వంపై వ్యతిరేకత ఎందుకు వ‌స్తుంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు.ఇక మ‌రో రెండేళ్ల‌లో ఎన్నిక‌లు వ‌స్తుండ‌టంతో ఓటు బ్యాంకు వ్య‌వ‌హారం తేల‌నుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube