భూ కక్ష్యలోకి చైనా రాకెట్ శకలాలు..తప్పిన పెను ముప్పు

చైనాకు చెందిన లాంగ్ మార్చ్ 5బీ వై3 రాకెట్‎కు సంబంధించిన భారీ శకలాలు భూ ఉపరితలంలోకి ప్రవేశించాయి.రాత్రి సమయంలో కావడంతో మిరిమిట్లు గొలుపుతూ హిందూ మహా సముద్రంలో పడిపోయాయి.

 Chinese Rocket Fragments Into Earth Orbit , Chinese Rocket, Chinese Rocket Fragm-TeluguStop.com

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‎గా మారింది.స్పేస్ స్టేషన్ నిర్మాణం కోసం కావాల్సిన ల్యాబరేటరీ మాడ్యూల్‎ని చైనా దేశం ఈనెల 24న లాంగ్ మార్చ్ 5బీ వై3 ద్వారా తరలించిన విషయం అందరికీ తెలిసిందే.

మలేషియాలోని కుచింగ్ పట్టణం ఉపరితలంలో విచ్ఛిన్నమైన చైనా రాకెట్ శకలాలు హిందూ మహా సముద్రంలో పడిపోయాయని అమెరికా అంతరిక్ష కమాండ్ ధృవీకరించింది.తూర్పు, దక్షిణాసియాలోని పలు ప్రాంతాల్లో ఈ శకలాలు మండుతూ భూ వాతావరణంలోకి రావడాన్ని ప్రజలు వీక్షించారు.

అయితే, గతంలోనూ చైనా ఇలాగే రెండుసార్లు రాకెట్ బూస్టర్ల రీఎంట్రీని సరైన మార్గంలో చేయకపోవడంతో భూ ఉపరితలంలోకి వచ్చాయి.లాంగ్ మార్చ్ 5బీ సముద్రంలో పడటంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తప్పింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube