హిమాలయాల్లోని అమర్‌నాథ్ గుహ సమీపంలో మరోసారి క్లౌడ్ బరస్ట్ జరిగిందన్న వార్త ఆందోళన కలిగిస్తోంది.మంచు లింగానికి సమీపంలో మరోసారి ఆకస్మిక వరదలు సంభవించాయి.
దాంతో వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.ప్రాణనష్టం జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఈ నెల 8న అదే ప్రాంతంలో చోటుచేసుకున్న క్లౌడ్‌బరస్ట్ వల్ల 15మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.మరోసారి ఆకస్మిక వరదలు రావడంతో యాత్రికులు ఆందోళన చెందుతున్నారు.
అమర్‌నాథ్ గుహకు సమీపంలో భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా అమర్‌నాథ్ యాత్రను మంగళవారమే తాత్కాలికంగా నిలిపివేశారు.పంచతరణీ నుంచి పవిత్ర గుహకు వెళ్లే మార్గంలో యాత్రను నిలిపివేశారు.
ఆ ప్రదేశం నుంచి దాదాపు నాలుగు వేల మంది యాత్రికులను తిరిగి పంచతరణీ శిబిరానికి రెస్క్యూ ఆపరేషన్ టీం సురక్షితంగా తరలించారు.
ప్రస్తుతం అమర్‌నాథ్ సమీపంలో ప్రతికూల వాతావరణమే ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే, క్లౌడ్‌బరస్ట్ జరిగినట్లు వస్తున్న వార్తలను జమ్మూకశ్మీర్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ తోసిపుచ్చింది.అమర్‌నాథ్ ప్రాంతంలో ఎటువంటి క్లౌడ్‌బరస్ట్ సంభవించలేదని తెలిపింది.
కారణం ఏదైనా ఆ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా విపత్తు నిరోధక సిబ్బంది హై అలర్ట్ తో చర్యలు చేపట్టింది.
అమర్‌నాథ్ సమీపంలో భారీగా వర్షాలు కురవడంతో అమర్ నాథ్ యాత్రను నిలపివేయడంతో అక్కడ ఉన్న అధికారులు యాత్రకులను ఆ ప్రాంతం నుంచి నాలుగు వేల మందిని తిరిగి పంచతరణీ శిబిరానికి సురక్షితంగా వారిని తరలించారు.ఆ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా విపత్తు నిరోధక సిబ్బంది హై అలర్ట్ తో చర్యలు చేపట్టింది.హిమాలయాల్లోని అమర్‌నాథ్ గుహ సమీపంలో క్లౌడ్ బరస్ట్ జరిగిందన్న వార్త ఆందోళన కలిగిస్తోంది.
అయితే 43 రోజులపాటు సాగే అమర్‌నాథ్ యాత్ర ఆగస్టు 11 తారీఖున ముగుస్తుంది.
DEVOTIONAL